అభధ్రతాభావానికి లోనై తక్కువ ధరకు అమ్ముకుంటూ నష్టపోతున్న పరిస్దితులున్నాయి :మంత్రి మోపిదేవి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
ఏప్రిల్ 04.


రాష్ర్ట పశుసంవర్ధక,మత్స్యశాఖమంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ ప్రెస్ మీట్ బ్రేకింగ్స్....


-ఆక్వా,డెయిరీ,పౌల్ట్రీ వంటి రంగాలలోని రైతులకు  ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సమక్షంలో నిరంతరం రిప్యూలు జరుపుతున్నాం.అధికారులను ఎక్కడికక్కడ అలెర్ట్ చేస్తున్నాం..


-కరోనా పాజిటివ్ కేసులు కొంత పెరుగుతున్నా కూడా చిన్నఅలసత్వం కూడా జరగకూడదనేది సిఎం శ్రీ వైయస్ జగన్  గారి లక్ష్యం.


-వ్యవసాయదారుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేవిషయం,ఆక్వా ఉత్పత్తులకు సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.


-ఇతర దేశాలకు ఎగుమతులకు క్లియరెన్స్ లు రాకపోవడం వల్ల రైతులు గిట్టుబాటు ధర లబిస్తుందోలేదోనని అభధ్రతాభావానికి లోనై తక్కువ ధరకు అమ్ముకుంటూ నష్టపోతున్న పరిస్దితులున్నాయి.


-దీనిని అధిగమించేందుకు ఎంపెడా ,మెరైన్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ వారితో సంయుక్తంగా సమావేశానన్ని ఏర్పాటుచేేశాం ధరలు అనౌన్స్ చేయడం జరిగింది.


-ఆ ధరలు లభించడం లేదని రైతులనుంచి ఫిర్యాదులు వచ్చాయి.


-కరోనా ప్రభావం వల్ల ప్రపంచం అంతా ఇబ్బందులకు లోనవుతుంది.


-ఆక్వా పరిశ్రమను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం.


-దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు.ఆక్వారైతులు అభధ్రతాభావానికి లోనుకావద్దు.


-ఈ మూడు రోజులలో 2,832 మెట్రిక్ టన్నుల ఎగుమతులు.


-ధరలు తగ్గిస్తే ఎగుమతిదారుల లైసెన్స్ లు రద్దు చేస్తాం.


-ఇప్పటికే ఆక్వా ఉత్పుత్తులపై ప్రభుత్వం ధరలు నిర్ణయించింది.


-ఆక్వారైతుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేస్తాం.


-ఆక్వాసెక్టార్ లో మధ్యవర్తుల వల్ల రైతులు నష్టపోతున్నారు.


-మధ్యవర్తుల వ్యవస్ద లేకుండా రైతులకు లాభం కలిగేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం.


-రానున్న రోజులలో ఆక్వారంగానికి మంచిభవిష్యత్తు మన రాష్ర్టానికి సంబంధించి ఉంటుంది.


-ప్రాసెసింగ్ యూనిట్లలోకి వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు.


-రైతులు నష్ట పోకుండాా సత్వర చర్యలు తీసుకోబోతున్నాం.


-రైతులు ఆభద్రతాబావానికి లోనుకాకుండా కొంత ఓపికతో ఉండాలి.సంయమనం పాటించాలి.


-ఆక్వాసెక్టార్ అంతా కూడా అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం ఉండి మార్పులకు లోనవుతుంటుంది.


-కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్దికవ్యవస్ధ కుదేలైంది.


-ప్రాసెసింగ్ యూనిట్లలో పనిచేసే కార్మికులకు రెండువందలరూపాయలవరకు అదనంగా ఇచ్చేందుకు సిధ్దంగా ఉన్నామని యాజమాన్యాలు కూడా ప్రకటిస్తున్నాయి.


-ఎంత మెటీరియల్ ఉన్నా కూడా దిగుమతి చేసుకుంటానికి పలు దేశాలు సిద్దంగా ఉన్నాయి.


-ప్రతి ప్లాంట్ కు స్పెషల్ ఆఫీసర్ ను అపాయింట్ చేశాం.


-గ్రామపెద్దలతో, ఫిషరీష్ డిపార్ట్ మెంట్లతో సంప్రదించి ప్రాసెసింగ్ ప్లాంట్లలోకి  కార్మికులు పనులకు వెళ్లేలా చర్చించమన్నాం.


-ముఖ్యమంత్రిగారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని అలా కల్పిస్తే, అలా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.


-ఎంపెడా ఛైర్మన్ తో కూడా ఇప్పటికే చర్చలు జరిపాం.


-ఆక్వా రైతులు నష్టపోకూడదనేది ప్రభుత్వ ధ్యేయం.


-కరోనాపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నిరంతరం సమీక్షలు చేస్తున్నారు