బి.సి కాలనీలో వి.యస్.ఆర్ బిల్డర్స్ అధినేత దాతృత్వం
వింజమూరు, ఏప్రిల్ 11 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) వింజమూరులోని బి.సి కాలనీలో శనివారం నాడు వి.యస్.ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వనిపెంట.సుబ్బారెడ్డి విస్తృత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన నడిమూరు, గంగమిట్ట ప్రాంతాలలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఉన్నారు. తాజాగా శనివారం నాడు బి.సి కాలనీలో దాదాపుగా వెయ్యి కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇంటింటికీ తిరిగి అందజేశారు. ఈ సంధర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ పేద , మధ్య తరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాలలో వనిపెంట.సుబ్బారెడ్డి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో ప్రజలకు విరివిగా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు యన్నం.రామచంద్రారెడ్డి, 6 వ సెగ్మెంట్ టి.డి.పి యం.పి.టి.సి అభ్యర్ధిని నూతలపాటి.జయమ్మ, గొంగటి.రఘునాధరెడ్డి, ఆరికొండ.శ్రీనివాసులు, గూడా.నరసారెడ్డి, చల్లా.శ్రీనివాసులు యాదవ్, నీలం.పెరుమాళ్ళు, గురజాల.వాసు, బోజనపు.క్రిష్ణ, ముస్లొం హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు రఫి, అల్తాఫ్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.