ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదు:  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి


తేది: 12.04.2020
అమరావతి  


                ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదు:  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి                                                           


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి మాట్లాడిన అంశాలు అమరావతి, 12 ఏప్రిల్ :జమాత్ నుంచి వచ్చిన ముస్లిం లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశాను. 


కరోనా చికిత్స పొందుతున్న రోగులు వైద్యులకు సహకరించడం, ఇతరులకు వైరస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలన్నదే నా ఉద్దేశం. 


ప్రతీ మతస్థుడు తమ ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చు.


 ప్రస్తుత కఠిన సమయం లో ఇళ్లలోనే ఇష్ట దేవతల ఆరాధన చేయాలనీ బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి గా సూచిస్తు వస్తున్నాను.


భావ వ్యక్తీకరణ లోపం కారణం గానే నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 
అంతేగాని ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదు.


నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉంది. ఈ విషయాన్ని నా ఆత్మసాక్షి గా చెబుతున్నాను. 


గత 5 సంవత్సరాలుగా నా వ్యక్తిగత భద్రత ను చూసే గన్ మెన్ కూడా ముస్లిం సోదరుడే. 


45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మతాన్ని, సామజిక వర్గాన్ని కించపరచలేదు. 


సమాజం లో SC, ST, BC మైనార్టీ వర్గాలు వెనుకబడి ఉన్నాయి. నేను కూడా అణగారిన SC వర్గానికి చెందిన వాడినే. 


ముస్లిం ల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వ్యక్తిని. 


నా నియోజకవర్గం లో ప్రతీ ముస్లిం కి ఇంటి స్థలాలు మొదలుకొని అన్ని సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తున్నాను. 
వారిపై ఎలాంటి ద్వేషభావం లేని వ్యక్తిని. 


శ్రీ Y.S.Jagan Mohan Reddy గారి ప్రభుత్వం SC, ST, BC, మైనారిటీ లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.


 నా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పై ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరణ ఇచ్చాను. 


దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.


నా మాటలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను.


నా మాటలను బేషరతుగా వాపసు తీసుకుంటున్నాను.  


అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను.


    
 సిి