ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాల్ని ఆదుకోండి. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్*
*పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామములో* మండల అధ్యక్షులు వీరపనేని శివరాం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తోట్ల వల్లూరు మండలం అన్ని గ్రామాల పేదలకు సుమారు 8000 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్*
ఈ సందర్భంగా *రాజేంద్రప్రసాద్* మాట్లాడుతూ లచ్చన్న గారు అప్పట్లో అణగారిన వర్గాల్లో విద్య బుద్దులు నేర్పి చైతన్యం తీసుకువచ్చారని, రాజకీయంగా కూడా తన గురువు ఎన్.ది రంగా గారి కోసం తన ఎంపీ పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న గొప్ప నాయకుడని ఈ రోజుల్లో ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకొనే సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని అన్నారు. అలాగే కరోనా కష్ట సమయంలో వల్లూరు మండలం మొత్తం అన్ని గ్రామాలకు ఇంటింటికి సరుకులు పంచుతున్న శివరాం ని అభినందిస్తున్నానని *రాజేంద్రప్రసాద్* అన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా B.C.సెల్ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, వల్లూరి కిరణ్ పెనమకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.