చిక్కుకుపోయిన వారు వారి స్వరాష్ట్ర లకు వెళ్ళే విధంగా మార్గదర్శకాలు : డాక్టర్ శ్రీకాంత్ అర్జా

AP FIGHTS COVID 19
COMMAND CONTROL
*****************************
అనేక మంది తెలుగువారు దేశంలో లాక్ డౌన్ వలన పలు ప్రాంతాలలో గత నలభై రోజులపాటు చిక్కుకుపోయారు. 


అదేవిధంగా ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్రంలో నిలిచిపోయారు.


కేంద్ర ప్రభుత్వం ఇలా చిక్కుకుపోయిన వారు వారి స్వరాష్ట్ర లకు వెళ్ళే విధంగా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. 


కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అను గుణంగా ప్రోటోకాల్స్ తయారు చేయబడి ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన మన వారందర్నీ మన రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలు ప్రభుత్వం చేపట్టనుంది.


గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల మంది మత్స్యకారులు వారి స్వస్థలమైన శ్రీకాకుళం విజయనగరం కు 54 బస్సులలో బయలు దేరారు . ప్రస్తుతం వారు తెలంగాణ లోకి ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ కానున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ మెడికల్ సదుపాయం కలుగజేసి వారివారి ఇళ్లకు చేరే విధంగా ప్రయత్నం చేస్తోంది. 
_______________________________
డాక్టర్ శ్రీకాంత్ అర్జా
స్టేట్ నోడల్ ఆఫీసర్-Covid19