రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టడం ఒక్క జగన్ కే చెల్లింది.   :గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

తేది.05.04.2020
       
కరోనా విపత్తులోను రోగ రాజకీయాలు చేస్తారా? 
గుంపులుగా తిరుగుతూ వైసీపీ ప్రచారం చేస్తారా? 
: ధ్వజమెత్తిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
దేశం నుంచి కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధుల విడుదల చేస్తే మిగిలిన రాష్ట్రాలు వాటితో పాటు తమ వాటా కొంత జతచేసి పేద ప్రజలకు సాయం అందిస్తున్నారు. కాని ఏపీలో మాత్రం అధికారపక్షం అందుకు భిన్నంగా కేంద్రం ఇచ్చిన నిధులను పంచకుండా పేదలను క్షోభకు గురి చేస్తుంది. కేంద్రం 3 నెలల రేషన్ సరుకులు, 3 నెలల నిధుల సాయం ఒకే దఫా ఇవ్వమంటే జగన్ మాత్రం వివిధ దఫాలుగా ఇచ్చి పేదల కడుపు కొడుతున్నారు. అంతే కాకుండా కేంద్రం ఆర్ధిక సాయంగా  పంచాయతీలకు, మునిసిపాలిటీలకు 14వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.1301 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద, 15వ ఆర్ధిక సంఘం ద్వారా  రూ.491.41 కోట్లు, విపత్తుల సహాయ నిధి కింది ముందస్తుగా రూ.559.50 కోట్లు. ఇలా మొత్తంగా 2,352 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ద్య కార్మికులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పని చేసే ఉద్యోగస్థులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉంది. పైపెచ్చు కేంద్రం నిధులను జగన్ జేబులో నుంచి ఇచ్చినట్లుగా వైకాపా నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ప్రస్తుత పరిస్థితిలో గుంపులు గుంపులుగా చేరి, బౌతిక దూరం పాటించకుండా, కనీస జాగృత్తలు లేకుండా కోవిడ్ వైరస్ ప్రజలకు విస్తృతంగా సోకేలా వైకాపా నాయకులు చేయడం హేయం.  కరోనా విపత్తులో సహాయ ఉపశమన చర్యల్లో పోటీ పడాలి తప్పా రోగ రాజకీయాలు మానుకోవాలి. కేంద్రం ఆఖరికి బియ్యం, కందిపప్పు ఇస్తే వాలెంటరీల ద్వారా ఇళ్లకే పంపిస్తానని హామీనిచ్చి చివరకు ప్రజలను క్యూలో నిలబెట్టి హింసించారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జగన్ చేపట్టిన చర్యలు సూన్యం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కరోనాను పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో అంతమొందించవచ్చని చెప్పి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ఎక్కడ ప్రశ్నిస్తుందన్న భయంతో రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టడం ఒక్క జగన్ కే చెల్లింది.