సినీ చరిత్రలో చిరస్మరణీయుడు: ఎఫ్ డి సి ఎండి విజయ్ కుమార్ రెడ్డి సంతాపం

సినీ చరిత్రలో చిరస్మరణీయుడు: ఎఫ్ డి సి ఎండి విజయ్ కుమార్ రెడ్డి సంతాపం


       విజయవాడ,ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు) :   రిషి కపూర్ మరణం సినీరంగానికి తీరని లోటని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్          తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బాలీవుడ్ లో మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా.. వంటి అనేక హిట్ సినిమాలలో నటించిన రిషి కపూర్ నటనా నైపుణ్యం దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిందని ఆయన అన్నారు. రిషి కపూర్ కుటుంబానికి విజయ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.