కావలి,. మే 5, (అంతిమ తీర్పు) రాజకీయ దురంధరుడు, మాజీ మంత్రి
స్వర్గీయ కలికి యానాది రెడ్డి (పెద్దాయన) 14 వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నందు ఉన్న కలికి యానాది రెడ్డి(పెద్దాయన) విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నాయకులు కనమర్లపూడి వెంకట నారాయణ,
కుందుర్తి కామయ్య, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కలికి యానాది రెడ్డి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కలికి యానాది రెడ్డి (పెద్దాయన) 14 వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళి