కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

*14–05–2020*
*అమరావతి*


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు


కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో అనుసరించాల్సిన ఎగ్జిట్‌ వ్యూహంపై సీఎంకు ప్రతిపాదనలు వివరించిన అధికారులు
లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో కీలక నిర్ణయాలు 


*కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు:*
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 290 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు
11159 గ్రామ సచివాలయాల్లో 151 సచివాలయాలు కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో  మొత్తం గ్రామ సచివాలయాల్లో 1.5 శాతం కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో 
3,858 వార్డు సచివాలయాల్లో 551 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో 
14.31 శాతం వార్డు సచివాలయాల్లో కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు


ప్రస్తుతం రాష్ట్రంలో 290 క్లస్టర్లు
వీటిలో 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
వాటిని డీనోటిఫై చేసి.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం.


కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్లు్ల కంటైన్‌మెంట్‌ ఏరియా, 500 మీటర్ల బఫర్‌ కలుపుకుని 1 కి.మీ పరిధిలో కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌. ఇక్కడ ఆంక్షలు కఠినంగా కొనసాగుతాయి.


మరొక 103 క్లస్టర్లలో (10, అంత కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు) 200 మీటర్లు మేర కంటైన్‌మెంట్, 200 మీటర్ల బఫర్‌ ఏరియాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఆపరేషన్స్‌ కొనసాగుతాయి. 


90 డార్మంట్‌ క్లస్టర్లలో (గడచిన 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాలు) 200 మీటర్ల కంటైన్‌మెంట్‌ ఏరియా అమలు. కొత్తగా కేసులు రాని పక్షంలో మే 31 తర్వాత ఆ క్లస్టర్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు.


ఎగ్జిట్‌ ప్లాన్‌లో భాగంగా థియేటర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థలు.. వీటిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు ఎలా కొనసాగించాలో నిర్దిష్ట విధానాలు (ఎస్‌ఓపీ) సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. వీటిపై ప్రణాళికను అందించాలన్న సీఎం. 


రాష్ట్రంలో ఉదయం 9 గంటలవరకూ 36 పాజిటివ్‌ కేసులు నమోదు
ఇవికాక వివిధ రాష్ట్రాలనుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మరో 32 కేసులు నమోదు
ముంబై నుంచి వచ్చిన వారికి 29, ఒడిశా–2, బెంగాల్‌ –1 కేసులుగా నమోదు
ముంబై నుంచి అనంతపురం వచ్చిన వారిలో ప్రబలంగా కనిపిస్తున్న కేసులు
మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్లలో పాజిటివ్‌ కేసులు అధికంగా ఉంటున్నాయన్న అధికారులు


*వలస కూలీలపై మానవతా దృక్పథం:*
ఇతర రాష్ట్రాలనుంచి రాష్ట్రంలోకి ప్రవేశించి, రాష్ట్రం మీదుగా ఒడిశా, జార్ఖండ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు సుదీర్ఘ దూరం నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు, ఘటనలపై సమావేశంలో చర్చ
సమీక్షా సమావేశంలో ఆవేదన వ్యక్తంచేసిన సీఎం
చాలా మంది అవగాహన లేక, శ్రామిక రైళ్ల కోసం నిరీక్షించలేక నడుచుకుంటూ వెళ్తున్నారన్న అధికారులు
వ్యవస్థీకృతంగా ఉంటే కనుక ఆయా రాష్ట్రాలతో మాట్లాడి పంపించడానికి అవకాశం ఉంటుందని వెల్లడించిన అధికారులు
చెక్‌పోస్టులవద్ద గుర్తించిన పక్కనే ఉన్న సహాయ కేంద్రాలకు పంపిస్తున్నామని తెలిపిన అధికారులు
అయినా సరే.. కొంతమంది రోడ్ల వెంట నడుచుకుంటూ వచ్చేస్తున్నారని వెల్లడించిన అధికారులు
ఇలాంటి వారిని వారి వారి స్వస్థలాలకు పంపడంపై ఆలోచన చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
వారికి ఆకలి బాధలు లేఏకుండా భోజనం తాగునీరు సదుపాయాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశం
నిర్దిష్ట దూరంలో భోజనం, తాగునీరు వారికి అందించేలా చూడాలన్న సీఎం


*జూలై 1 నాటికి ప్రతి పీహెచ్‌సీకీ ఒక బైక్‌:*


టెలీమెడిసిన్‌ను మరింత పటిష్టంచేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌.
జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం
అదే రోజు 108,104 అంబులెన్స్‌లు 1060 ప్రారంభం
వీటితోపాటు బైక్‌ సర్వీసులు కూడా ప్రారంభం
టెలిమెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌డెలివరీ చేయడానికే బైక్‌ల వినియోగం


*సీఎం యాప్‌ :*
ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించే నాటికి మార్కెట్‌ ఇంటెలిజెన్స్, ప్రొక్యూర్‌మెంట్‌కోసం ఉద్దేశించిన  యాప్‌ అందుబాటులోకి రావాలన్న ముఖ్యమంత్రి
దీనిపై కొత్తగా నియమించిన జేసీలకు శిక్షణ ఇస్తామన్న అధికారులు.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image