బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దేవాలయాన్ని ఎంతో ముందు ఆలోచనతో కాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో వీలైతే ఉచితం గా మెరుగైన వైద్యం అందించాలని గొప్ప ఆశయంతో స్థాపించిన మహానుభావులు కీ.శే. శ్రీ నందమూరి తారకరామారావు పుణ్య దంపతుల పెళ్లి రోజు సందర్భం గా మే 2 న హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ కి విచ్చేసి పూల మాలలతో ఆ పుణ్య దంపతులకు నివాళులు అర్పించారు.
అంతేకాక ఇదే రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబెర్ అయిన కీ.శే. డా. శ్రీ కోడెల శివప్రసాదరావు పుట్టినరోజు సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది.
తర్వాత చైర్మన్ బాలకృష్ణ అమ్మ నాన్న ల తో గడిపిన మధురానుభూతులు మరియు మన హాస్పిటల్ స్థాపించటానికి గల కారణాలను, కోడెల కృషిని గుర్తుచేసుకుని విలువైన సమాచారాన్ని అందరికి తెలియచేయటం జరిగింది. దీనితో పాటు గా పేదవారికి అన్నదానం చేశారు.
తర్వాత హాస్పిటల్ వైద్యులతో సంప్రదింపులు జరిపి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఇంకా ఏమైనా మెరుగుపరచడానికి సలహాలు తీసుకుని మరియు కోవిడ్-19 గురించి తీసుకుంటున్న / పాటిస్తున్న జాగ్రత్త లు స్వయం గా పరిశీలించి విలువైన సలహాలు ఇవ్వటం జరిగింది.