ఎండలో సైతం సేవలో..
విధి నిర్వహణలో వాలెంటేర్లు..
కావలి,
ప్రజ సేవలో నిరంతరం కష్టపడుతున్న సమాజ సేవకులు వారు..ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుగు ముగింట్లో అందించే నవ సేవకులు వారు.. ప్రజలకు సంక్షేమం గురించి పాఠాలు వలించే చైతన్యం దీపికాలు వారు... ప్రతి కుటుంబాన్నికి వారే జగనన్న ఇచ్చిన నిజమైన వారసులు...అవ్వ తాతల నవ్వుల్లో విరభూసిన వెలుగులు వారు.. ఒకటవ తేదీన లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చి జీతం తీసుకొనే ప్రభుత్వ సర్వెంట్లు వారు... ప్రజలకు ,ప్రభుత్వాన్నికి మద్య పనిచేసే వారధులు ...యాబై ఇళ్లల్లో ఒక్కొక్కరు ఒకొక్క చైతన్య దీపికాలు వారు....నవ సమాజ నిర్మాణoలో అలుపెరగని శ్రామికులు... వారే.. వారే.. సర్కార్ లో కొలువు చేస్తున్న మన వాలెంటేర్లు..ఆ వాలేంటేర్లు బ్రతుకు చిత్రం చూస్తే అయ్యో అనిపిస్తుoది..ప్రతి ఇళ్లల్లో అన్ని ఉన్నాయా అని అడిగి మరీ వారి పనులు చేసిపెడ్తారు.. కానీ వారికి మాత్రo ఏమి లేకపోయిన సర్దుకుని కొలువు చేస్తారు.. ఏ ఇంటికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం మోసుకొని అధికారులకు చేరవేస్తారు.. వారికి కష్టం వస్తే మాత్రం కడుపులో దాసుకొంటారు.. ఎండనక, వాననాక తిరుగుతూ సమాజ సేవ చేస్తారు.. కరోనా లో సైతం ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ చేస్తున్నారు.. ఎక్కడి సమాచారం అక్కడ చేరవేసి కరోనా కట్టడిలో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. జబ్బు చేసిన ఒక్కపూట కూడా సెలవు పెట్టకుండా విధి నిర్వహణ చేస్తారు.. ఇంతచేసిన జీతం మాత్రం అరా కోరే..కడుపునిండా తినడానికి ఆ జీతం సరిపోక నానా అగచాట్లు పడుతున్నారు. రోజoతా కష్టపడిన కొలువు గ్యారంటీ లేదని వలంటేర్లు వాపోతున్నారు.. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి నిరంతరం కష్టపడుతున్న వాలంటేర్లు శ్రమను గుర్తించి వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.