కావలి కమీషనర్ నరసరావుపేట కు బదిలీ 

కావలి కమీషనర్ బదిలీ
---------------------------------------
కావలి మున్సిపల్ కమీషనర్ 
డాక్టర్ కే వెంకటేశ్వరరావు ను బదిలీ చేస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్ ( జె ఐ ) డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది . జీవో ఆర్ టీ నెంబర్ 213 తేదీ 01 - 5 - 2020 న ఈ ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసింది . ఆయన్ను నరసరావుపేట కమీషనర్ గా బదిలీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది .


కావలిలో పనిచేయడం కష్టంగా ఉందని చెబుతూ వస్తున్న  కమీషనర్ - కొద్ధి రోజులుగా బదిలీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు . ఆ ప్రయత్నాల్లో భాగమే ఈ బదిలీ గా తెలుస్తుంది . కరోనా సమయంలో కే వెంకటేశ్వరరావు చేసిన కృషి ప్రశంసనీయం . 
-----------------------------------------