ఆపన్నహస్తం కోసం అభాగ్యుల ఎదురుచూపు

ఆపన్నహస్తం కోసం అభాగ్యుల ఎదురుచూపు
 ఉదయగిరి లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ వాసులు
 ఉదయగిరి. ప్రాణాంతక కరోనా వైరస్ సోకితే చనిపోవడం మా బతకడమా తర్వాత విషయం కానీ పట్టెడన్నం పెట్టే దిక్కు లేక, భాష రాక, ఎవరిని కలవాలో తెలియక, ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రతి క్షణం ఒక యుగంలా పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు వలస కూలీలు పశ్చిమ బెంగాల్ నుంచి పొట్ట చేత పట్టుకొని కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు సరిచేసే వలస కార్మికులు ఉదయగిరి ప్రాంతానికి వచ్చారు. వారిని తీసుకు వచ్చిన మేస్త్రీలు ఎక్కడి వాళ్ళు అక్కడ వదిలేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు కానీ వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు సుమారు 12 మంది పశ్చిమబెంగాల్ వాసులు ఉదయగిరి మండలం గుడి నర్వా గ్రామంలో తలదాచుకుంటున్నారు. అక్కడ పశువుల పాకలో పనిచేసే ఒక కుర్రవాడి దగ్గరికి వీరు అతి కష్టం మీద చేరుకొన్నారు. గత వారం రోజులుగా తిండి లేక నాన్న వాళ్లతో ఫోన్ లో మాట్లాడుకునే సౌకర్యం కూడా లేక నిత్య నరకం అనుభవిస్తున్నారు ఈ వలస కూలీలు. అధికారుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే అన్నం పెట్టడం మా డ్యూటీ కాదు అనుమతి మాత్రం తీసుకుని మిమ్మల్ని పంపిస్తాం  అని చెప్పడంతో ఎప్పుడు అనుమతి వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. భాష చేతకాక పోవడంతో అన్నం పెట్టమని అడుక్కునే స్థాయిలో కూడా వాడలేక పోవడం చూపరులను కలిచివేస్తోంది ఉన్నతాధికారులు తక్షణం స్పందించి వారికి అనుమతి ఇచ్చి వారి ప్రాంతానికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దాతలు కూడా ఎవరైనా స్పందించి వారికి అంత అన్నం పెట్టి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకుంటున్నారు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image