పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ::రమణారెడ్డి .............ఆత్మకూరు (అంతిమతీర్పు ఇంచార్జ్ రహమత్ ఆలీ .)
ఆత్మకూరు:. పట్టణంలోని పలు ప్రాంతాలలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐ.వి. రమణారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇటీవల సుమారు వెయ్యి మందికి నిత్యవసర సరకులు కూరగాయలను అందజేసిన రమణారెడ్డి ఆదివారం మరో 200 మందికి, ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై . సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా సరకులను అందజేసినట్లు ఐ వి రమణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు పులిమి శైలజ రెడ్డి, నాయకులు దావా పెంచలయ్య, కోడురు రామయ్య, రమణయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ::రమణారెడ్డి