53వ రోజు కు చేరిన  సంయుక్త సేవాసంస్థ సేవలు.

53వ రోజు కు చేరిన  సంయుక్త సేవాసంస్థ సేవలు....


కావలి ,మే13 (అంతిమ తీర్పు - N. సాయి )


   దాత  ఉపాధ్యాయులు '"నేలటూరి  శివప్రసాద్ రెడ్డి'"  సహకారంతో  కావలి పట్టణం తుఫాన్ నగర్ రెడ్ జోన్ ప్రాంతంలో సంయుక్త సేవ సంస్థ ఆధ్వర్యంలో   150 కుటుంబాలకు  కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి  దాత నేలటూరి శివప్రసాద్ రెడ్డి  నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు గంధం ప్రసన్నాంజనేయులు  సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, హ్యాపీ సేవాసంస్థ అధ్యక్షుడు సయ్యద్ గని భాషా పాల్గొని కూరగాయలు   పంపిణీ చేయడం జరిగింది. 
     ఈ సందర్భంగా దాత శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆటో డ్రైవర్ గా ఉంటూ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినానని తెలిపారు. గంధం ప్రసన్నాంజనేయులు  మాట్లాడుతూ  సంయుక్త సేవాసంస్థ ద్వార నిరుపేదలకు కూరగాయలు అందజేసిన  శివప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు .