- రూ.9,514తో కోట్లతో పలు అభివృద్ధి పనులకు "ఉపాధి హామీ" అనుసంధానం : మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి
06.05.2020



- కరోనా కష్టకాలంలో గ్రామీణ పేదలకు భరోసాగా "ఉపాధి హామీ"


- గ్రామీణ కూలీలకు ఉపాధితో పాటు వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు ఊతమిచ్చేలా కార్యాచరణ


- గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత


- ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఉపాధి హామీతో ఊతం


- రూ.9,514తో కోట్లతో పలు అభివృద్ధి పనులకు "ఉపాధి హామీ" అనుసంధానం


- గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1.85 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం


- సన్న, చిన్నకారు రైతులకు రూ.300 కోట్లు కేటాయింపు


- సెరీకల్చర్ శాఖ ఆధ్వర్యంలో రూ.76 కోట్లతో మల్బరీ మొక్కల పెంపకం 


- అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.117 కోట్ల ఖర్చుతో వెయ్యి నర్సరీలలో మొక్కల పెంపకం


- గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.5,079 కోట్లు కేటాయింపు


- రూ.593 కోట్ల అంచనాలతో
ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా గ్రామాల్లో 3,932 చోట్ల సిసి డ్రైన్ ల నిర్మాణం.



- రూ.1,640 కోట్లతో పిఆర్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం.


- గిరిజన ప్రాంతాల్లో కొత్తగా బిటి, మెటల్ రోడ్ల నిర్మాణానికి గాను రూ.46.70 కోట్లు



- రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు రూ.100 కోట్లు


- నాడు-నేడు ద్వారా 11,623 సర్కారు బడులకు రూ.995 కోట్లతో ప్రహరీల నిర్మాణం