గుంటూరు జిల్లా APUWJ &నరసరావుపేట ప్రెస్ క్లబ్  సేవలు వెలకట్టలేనివి. : నరసరావుపేట రూరల్ సి ఐ అచ్చయ్య

గుంటూరు జిల్లా APUWJ &నరసరావుపేట ప్రెస్ క్లబ్  సేవలు వెలకట్టలేనివి. : నరసరావుపేట రూరల్ సి ఐ అచ్చయ్య...లాక్ డోన్ నేపధ్యంలో జర్నలిస్టుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యూనియన్ నేతలు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం అభినందనియమన్నారు..
నరసరావుపేట నియోజకవర్గంలో ని జర్నలిస్టుల నిత్యావసర వస్తువులని రూరల్ సిఐ అచ్చయ్య.యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ లు  పంపిణీ  చేశారు..
జర్నలిస్టులు పోలీసులకి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రాని సిఐ అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ నిత్యం జర్నలిస్టులు ప్రభుత్వం అధికారులతో సమానంగా ఇటువంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని,ప్రభుత్వం కూడా జర్నలిస్టుల కి 50 లక్షల ప్రమాద భీమ కల్పించాలని కోరారు..
జిల్లా కార్యదర్శి యేచురి శివ మాట్లాడుతు జిల్లాలో జిల్లాలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కి యూనియన్ అండగా ఉంటోందని ఇప్పటికే జిల్లాలో 400 మందికి వివిధ రకాల సహకారాన్ని అందించన్నారు..
యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అలంశెట్టి కిషోర్, పుల్లం శెట్టి నాగరాజు,ఆనంద్, అప్పారావు, గంగాధర్,నరసయ్య,అవినాష్,పవన్ తదితరులు పాల్గొన్నారు