అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ లో వెంటనే శానిటైజేషన్ చేయాలని డిమాండ్.: కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ

అమరావతి మే 16 (అంతిమ తీర్పు) :


నేటి బాలలే - రేపటి పౌరులు అని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుందా... 


జగన్ సర్కారుని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ


ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలి... డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత.


భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని.. తగిన ఆదేశాలు వెంటనే జారీ చేయాలని కోరిన పద్మశ్రీ.


అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ లో వెంటనే శానిటైజేషన్ చేయాలని డిమాండ్.


కుర్చీలు, బల్లలు, శానిటైజేషన్, మినరల్ వాటర్, మాస్కులు ఇతర మౌళిక వసతుల కోసం ఒక్కో రాష్ట్రానికి 2000 కోట్లు మంజూరు చెయ్యాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత.


కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని స్వయంగా జగన్ రెడ్డి గారే చెప్పారు... అలాంటప్పుడు దాన్ని పాఠశాలలకు విస్తరించకుండా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు.


రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు  ప్రభుత్వ పాఠశాలల పైన దృష్ఠి పెట్టి, పిల్లలు  కరోనా బారిన పడకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్..


ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ