కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలపాలి. ;కడపజిల్లా కలెక్టర్ CH హరి కిరణ్

కడప, మే 10 (అంతిమ తీర్పు) :


తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలపాలని కడపజిల్లా కలెక్టర్ CH హరి కిరణ్ ఒక ప్రకటన లో తెలిపారు.
తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుండి లారి లలో పండ్లు కూరగాయలు తీసుకొని కడపజిల్లా వచ్చిన హోల్ సేల్ వ్యాపారులు, రిటైలర్లు పండ్లు ,కూరగాయలు లారీలలో నింపడం మరియు దించడం చేసే హమాలి కూలీలు ఎవరైనా వస్తే వెంటనే జిల్లాలో ని కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ,08562 245259, 259179 నెంబర్లు కు ఫొన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ CH  హరి కిరణ్ తెలిపారు.అలాంటి వారిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి ఫాతిమా మెడికల్ కాలేజ్ కి గాని లేదా జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు కు వచ్చి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి గా చేయించుకోవాలన్నారు. లేదా వారికి అందుబాటులో గాని  దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ ను గాని సంప్రదించాలన్నారు. వ్యాపార నిమిత్తం వచ్చేవారికి పక్క జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు.దీని దృష్ట్యా కోయంబేడు నుంచి కడప కు,కడప నుండి కోయంబేడు కు వ్యాపారం కోసం  వెళ్లి వచ్చే హోల్ సేల్, రిటైల్,హమాళిలు అందరూ తప్పనిసరిగా ఈ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ CH  హరి కిరణ్ ఒక ప్రకటన లో తెలిపారు