అమర బ్రదర్స్ సహకారంతో. భోజన ప్యాకెట్లు పంపిణీ : వైసీపీ నాయకుడు అమర యాదగిరి గుప్తా

కావలి,మే 8 (అంతిమ తీర్పు):


శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపిన ప్రకారంగా పది వ  వార్డులో ఇందిరమ్మ కాలనీలోని నూటా యాభై మందికి పేదలకు  అమర బ్రదర్స్ నిధులతో భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని వైసీపీ నాయకుడు అమర యాదగిరి గుప్తా తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కరోనా మహమ్మారి వలన పేద ప్రజలు పనులులేక దుర్భర జీవితం బతుకుతున్నారని ,ఈ లాంటి సమయంలో  వారికి చేయూత నివ్వడం  ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్  పేరం వెంకటేశ్వర్లు  , 33 వ వార్డు వైసీపీ నాయకులు పట్నం శివ , కాసా విజయ్ , ఇన్నమూరి సతీష్కుమార్,  పైడా లక్ష్మీపతి ఓలేటి  రాము , బొగ్గవరపు స్వామి , బొగ్గవరపు శ్రావణ్ , పెసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు