ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి  వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి 
వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ


విజయవాడ,మే 10,(అంతిమ తీర్పు):


కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకొని ఆహారం అందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఓంకార్ సేవా సమితి అధ్యక్షుడు గండే సాంబశివరావు అన్నారు కరోనా కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టాలని దానిగాను ప్రజలు ప్రభుత్వం, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు బౌతిక దూరంతో కరోనాని దూరం చేయవచ్చు అని సాంబశివరావు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం జరిగిన అల్పాహారం పంపిణీ గుళ్లపల్లి బూర్లమ్మ డొంక ,ఆరేపల్లి కాలనీ ప్రాంతాల్లో వలస కార్మికుల చిన్న పిల్లలకు వందలాది మందికి ఇడ్లీ పొట్లాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, సేవ సమితి సభ్యులు తూనుగుంట్ల శ్రీనివాసరావు, కేసన సాంబశివరావు, సీతారామయ్య, కుమార్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగానిర్విరామంగా సాగుతున్న ఆహార పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంటుందని సేవా సమితి అధ్యక్షుడు తెలిపారు