పొగాకు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించిన మంత్రి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 09-05-2020,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.


పొగాకు రైతులను కష్టాలనుంచి గట్టెక్కించిన మంత్రి గౌతమ్ రెడ్డి


*  పొగాకు కొనుగోళ్ల పున:ప్రారంభానికి చొరవచూపిన మంత్రి


* కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్, పొగాకు అధికారులకు ఆదేశం


*  రైతులు, బోర్డు అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచనశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మే, 09; కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయి ఆందోళన చెందుతున్న పొగాకు రైతులను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గట్టెక్కించారు. రోజురోజుకి రంగుమారి, కొనుగోలు జరుగుతుందో లేదోనని మొరపెట్టుకున్న రైతుల కష్టం విని చలించిపోయారు. తాజాగా జిల్లా  అధికార యంత్రాంగంతో ఈ అంశంపై చర్చించినా కరోనా పాజిటివ్ కేసులు, పొగాకు బోర్డు ఉన్న మర్రిపాడు మండలంలోని డీసి పల్లి  ప్రాంతం రెడ్ జోన్ కావడంతో కొనుగోలు ప్రారంభం కుదరలేదు. తాజాగా మంత్రి గౌతమ్ రెడ్డి టొబాకో బోర్డు అధికారులతో చర్చించడంతో పాటు, జిల్లా కలెక్టర్ కు పొగాకు కొనుగోళ్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో శరవేగంగా శుక్రవారం ఎం.వీ శేషగిరి బాబు జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాలైన డీసీ పల్లి, కలిగిరిలను గ్రీన్ జోన్ గా ప్రకటించి పొగాకు కొనుగోళ్లు  మే నెల 11వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించాలని మార్గదర్శకాలిచ్చారు. సుమారు 45 రోజులుగా లాక్ డౌన్ కారణంగా పొగాకు కొనుగోళ్లు ఎక్కడికక్కడ  నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తుల అంశంలో వెసులుబాటు కలిగించడం, డీసీ పల్లిలోని పాజిటివ్ కేసులు నెగటివ్ గా మారడం, మర్రిపాడు ప్రాంతం గ్రీన్ జోన్ పరిధిలోకి రావడంతో మంత్రి గౌతమ్ రెడ్డి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వడం పొగాకు రైతుల్లో కొండంత భరోసా నింపింది. అయితే, పొగాకు కొనుగోళ్ల సమయంలో గుంపులు గుంపులుగా ఉండకుండా రైతులు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. వాక్సిన్ వచ్చేవరకూ ఈ జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించడం అలవాటు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని, రైతులందరి పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


*


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం