అస్వస్ధతకు గురై ప్రైవేటు ఆస్పత్రులలో ఉన్నవారందరూ డిశ్చార్జ్ : వ్యవసాయశాఖమంత్రి   కురసాలకన్నబాబు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
విశాఖపట్నం
మే 13.


*రాష్ర్ట వ్యవసాయశాఖమంత్రి   కురసాలకన్నబాబు ప్రెస్ మీట్ కామెంట్స్*...


విశాఖఎల్జీ పాలిమర్స్ సంఘటనలో 585 మంది అస్వస్ధతకు
గురై ఆస్పత్తులలో చేరారు.ప్రైవేటు ఆస్పత్రులలో ఉన్నవారందరూ డిశ్చార్జ్ అయ్యారు.


కేజిహెచ్ లో 300 మంది పేషంట్లు ఉన్నారు.వైద్యపరీక్షలు చేశాక 287 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది.వారందరికీ శ్రీ వైయస్ జగన్   ప్రకటించినట్లుగా రెండురోజులు దాటి ఆస్పత్రిలో ఉంటే లక్షరూపాయలు ఆర్దికసహాయం కింద చెక్కులు అందించాం.


మృతి చెందినవారికి సంబంధించి  ఎనిమిది మంది కుటుంబసభ్యులకు ఇప్పటికే కోటిరూపాయలు చొప్పున అందించాం.లీగల్ గా అన్ని అంశాలు పూర్తి కావడంతో మిగిలిన నలుగురికి వారి అకౌంట్స్ లో రేపు  డిపాజిట్ అవుతుంది.


రాష్ర్టంలోగాని,దేశంలోగాని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఇంతపెద్ద ప్యాకేజి ఎన్నడూ ఇవ్వలేదు.


గ్రామాలకు ప్రజలు తిరిగి వెళ్లిన తెల్లవారే ఎన్యుమరేషన్ ప్రారంభించాం.ప్లాంట్ గోడను ఆనుకుని నివసిస్తున్న కుటుంబాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని సిఎంగారు ఆదేశించారు.


గ్రామాలలో అభివధ్ది పనులను కూడా చేపడుతున్నాం.వైయస్సార్ క్లినిక్ ను ఆరు గ్రామాల ప్రజలకోసం ఏర్పాటుచేస్తున్నాం.24 గంటలపాటు పనిచేసే వైద్యశిబిరాలు కూడా ప్రారంభమయ్యాయి.


ముఖ్యమంత్రిగారు ఆదేశించిన విధంగా స్టైరిన్ ను ఇక్కడనుంచి పంపించే ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది.8 వేల టన్నులతో ఓడ ఒకటి ఈరోజు మధ్యాహ్నం దక్షిణకొరియాకు బయల్దేరి వెళ్లింది.మరోషిప్ వస్తోంది.షిప్ రాగానే మిగిలిన స్టైరిన్  లోడింగ్ స్టార్ట్ అవుతుంది.


ఈ చర్య తీసుకోవాలంటే నాయకుడుకి దమ్ముండాలి.అలా దమ్మున్న నాయకుడే జగన్ గారు.ఒక్క టన్ను స్టైరిన్ కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు.ఇందుకు అవసరమైన అనుమతులు కూడా సిఎంఒనుంచి ఢిల్లీ మాట్లాడి ఇప్పించారు.


ఏ పరిశ్రమ అయితే ప్రమాదకర రసాయనాన్ని ఇక్కడ ఉంచిందో ఆ పరిశ్రమపైన, నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకు తెరిచేది లేదు.ముందు మీ వద్దఉన్న మెటిరీయల్ నంతా పట్టుకెళ్లండని ఒక ఎంఎన్ సి కంపెనీకి ముఖ్యమంత్రి చెప్పడం అంటే దానికి చాలా ధైర్యం,దమ్ము ఉండాలి.


అలాంటి దమ్ము ఉంది కాబట్టే స్టైరిన్ మొత్తాన్ని ఖాళీ చేయించారు.మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి.


అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేస్తుంటే, హైద్రాబాద్ లో హోం క్వారంటైన్ లో కూర్చుని రాసేవాళ్ళుఉన్నారు...చూపించే వాళ్లు ఉన్నారని...ఇష్టం వచ్చినట్లు బురదచల్లుతున్నాడు.


దేనిని రాజకీయం చేయాలో కూడా ఆయన జీవితకాలంలో కూడా తెలుసుకోలేడని భావిస్తున్నాం.ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రిగారు వెంటనే ఊహించినదానికంటే ఎక్కువ చర్యలు తీసుకుని  ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటే చూడలేక ఈ కధంతా చంద్రబాబు నడిపిస్తున్నాడు.


చంద్రబాబు హయాంలో ఇలాంటి సంఘటనలు రెండు,మూడు జరిగాయి.తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీకయి  21 మంది బొగ్గుల్లాగా మాడిపోయారు.పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.నెలలతరబడి ఆస్పత్రులలో ఉన్నారు.


గోదావరి పుష్కరాలలో నీ షూటింగ్ సరదాకోసం చేసిన స్నానానికి రాజమండ్రిలో 29 మంది ప్రాణాలను బలిగొన్నారు.అలాంటి సందర్భాలలో మీరు ఎలా స్పందించారో, మీరేం సహాయం చేశారో....ఈ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఏ విధంగా స్పందించారో చర్చకు రమ్మని పిలుపుఇస్తున్నాను.


మీ ఇష్టం.... మీ వద్ద రసాయన శాస్ర్తవేత్తల బృందం ఉంది.అచ్చెన్నాయుడు,రామానాయుడు,చినరాజప్పగారవచ్చు.మీరుగాని, లోకేష్ గాని ,ఎవరైనా రండి కూర్చుని మాట్లాడుకుందాం.


మేం ఏం చేశామో చెబుతాం,ఇంకా ఏం చేయాలో చెప్పండి....మీరు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్యాకేజిలు ఇచ్చి  బాధితులను ఆదుకున్నారా...ఈ ప్రభుత్వం వచ్చాక జగన్ గారు ఆదుకున్నారో తేల్చుకుందాం రండి.


కల్లబొల్లిమాటలు చెప్పి ప్రజలను నమ్మిస్తామనుకుంటే ఎట్టిపరిస్ధితులలో కుదరదు. ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటిస్తే చాలదన్నట్లుగా మాట్లాడుతూ కొరియాలో ఎంత పరిహారం ఇస్తే అంత పరిహారం ఇప్పించమంటున్నారు.


గెయిల్ సంఘటన జరిగినప్పుడు శ్రీ వైయస్ జగన్ గారు భారీగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాని అప్పుడు మీరు కంపెనీ తరపున 20 లక్షలు,మీ తరపున 3 లక్షలు,కేంద్రం తరపున 2 లక్షలు ప్రకటించి అవి కూడా సకాలంలో ఇవ్వకపోతే బాధితులు ఆందోళన చేశారు.


చనిపోయినవారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు.ఈరోజువరకు వారికి అలా ఇప్పించారా...ఈరోజు వచ్చి ఈ ప్యాకేజిని తప్పుపడుతున్నారు.


ముఖ్యమంత్రిగారు ఇక్కడకు వచ్చి కంపెనీతో సంబంధం లేకుండా ప్యాకేజి ప్రకటించారు.ఆ కంపెనీ ఇస్తుందో...లేదో...భవిష్యత్తులో పరిహారం ఎంత వస్తుందో కూడా తెలియదు.అయినా కూడా మనస్సున్న నాయకుడిగా ప్యాకేజిని ప్రకటించారు.


చంద్రబాబు ఏదో దానకర్ణుడిలాగా... గతం మనం అంతా మరిచిపోయేమనే విధంగా బిల్డప్ ఇస్తున్నారు.గతంలో చాలా సంఘటనలలో బాధితులను చంద్రబాబు కించపరిచిన ఉదంతాలు ఉన్నాయి.కావాలంటే వాటిగురించి చెప్పుకుందాం రండి.


చంద్రబాబు లాంటి వ్యక్తులతో చెప్పించుకునే పరిస్ధితి మా ముఖ్యమంత్రికి,మా ప్రభుత్వానికి రాదని చెబుతున్నాను.


పశువులకు గడ్డి,సైలేజ్ ఏర్పాటుచేయాలని,అక్కడ ఆస్పత్రిని ఏర్పాటుచేయాలని చంద్రబాబు టిడిపి పోలిట్ బ్యూరోలో డిమాండ్ చేస్తున్నట్లుగా మాట్లాడారు.కాని వాటిని మేం ఇప్పటికే ఎరెంజ్ చేశాం.చంద్రబాబు రేపు మేం చెబితే గాని అవి ఏర్పాటుచేయలేదని రాయించుకుంటారు.


నిపుణులైనవారితో ఆరుకమిటీలను ప్రభుత్వం నియమించింది.అవన్నీ ఆల్రెడీ పనిచేస్తుంటే నిపుణులు రావాలంటూ ఆయన డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది.


ఎల్జీపాలిమర్స్ కు అనుమతులు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది.కాలుష్యనియంత్రణమండలిని వత్తిడిచేసి ఇప్పించారని సమాచారం.అప్పన్న భూములను కూడా ఎల్జీ పాలిమర్స్ కు ఇచ్చేస్తూ మీరు జిఓ ఇచ్చారు.ఇప్పుడు మాకేం తెలియదు.నేను చాలా ఉత్తముడ్ని అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు.కాని జిఓలన్నీ ప్రభుత్వంలో ఉంటాయి.


 పర్యటన ముగించుకుని వెళ్లేటప్పుడు లాంజ్ లో ముఖ్యమంత్రిగారు  అందరి ఎదుట ఎల్జీపాలిమర్స్ కంపెనీ ప్రతినిధులను
 అలారమ్ ఎందుకు మోగలేదని అడిగారు.వారితో మంతనాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.


మంతనాల ఆడే స్వభావం కాని,లోపాయికారి ఒప్పందాలు కాని చేసుకోవడంలో చంద్రబాబు సిధ్దహస్తుడు. *వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ విజయసాయిరెడ్డి కామెంట్స్*....


చంద్రబాబునాయుడుగారి గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను.ప్రభుత్వం జారీ చేసిన జిఓ 203..... శ్రీశైలం నుంచి రాయలసీమకు సాగునీరు,తాగునీరు ఇవ్వాలా వద్దా దీనిపై మీ అభిప్రాయం ఏంటి. 


 ప్రధానప్రతిపక్షనేత అయిఉండి ఇంతవరకు ఈ జిఓపై ఎందుకు మీ అభిప్రాయం తెలియచేయడం లేదు.


మనం తెలంగాణాకు ఎలాంటి అన్యాయం చేయడంలేదు.మన రాష్ర్టానికి,రాయలసీమకు న్యాయం జరగాలని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం.


రాష్ర్ట ప్రయోజనాలపై మాట్లాడలేని ప్రతిపక్షనాయకుడు...ఒక ప్రతిపక్షనాయకుడేనా....అతను రాష్ర్టంలో ఉండాల్సిన అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాను.


విశాఖపట్నంకు ఎలాంటి పరిస్ధితులలోకూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదనే ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తున్న నాయకుడు ఉన్నాడంటే అతను చంద్రబాబునాయుడు మాత్రమే.


తనకు,తన తాబేదార్లకు అమరావతిలోను,ఆ చుట్టుపక్కల వేలఎకరాలు కలిగిఉన్న వ్యక్తుల ప్రయోజనాలు కాపాడటమే చంద్రబాబు లక్ష్యంగా కనపడుతోంది.


విశాఖపట్నంను ఒక విలన్ గా చూపించాలనే దుర్మార్గమైన గేమ్ ప్లాన్ వేసిన వ్యక్తి చంద్రబాబు.ఆ ప్లాన్ లో భాగంగానే ప్రమాదం జరిగినప్పటినుంచి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు,వారు చేస్తున్న విమర్శలు, ఆ ఎల్లోమీడియా చేస్తున్న చర్చలు ఇవన్నీ కుట్రలో భాగం.


అధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి పార్టీని,ఎన్టీఆర్ ట్రస్ట్ ను లాక్కుని పాతికేళ్ల క్రితమే తెగించినవాడు.... ఈ విశాఖకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగిస్తాడని సందేహం లేకుండా చెప్పవచ్చు.


అధికారంకోసం ఎన్ని దుర్మార్గాలకైనా పాల్పడేవ్యక్తి.చంద్రబాబు గురించి స్వయానా ఎన్టీఆర్ చెప్పిన మాటలను రాష్ర్టప్రజలు,విశాఖప్రజలు ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలి.


ఎల్జీపాలిమర్స్ ప్రమాదంలో మరణాలపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తల్లడిల్లారు.బాధ్యులను శిక్షించేందుకు, ఎవరు దీనికి బాధ్యులని తేల్చేందుకు కమిటీలను నియమించారు.గతంలో లేని విధంగా పరిహారం ప్రకటించారు.


చంద్రబాబు మాత్రం హైద్రాబాద్ లో కూర్చుని కొరియాలో ఇచ్చే విధంగా పరిహారం ఇవ్వాలని కొత్తరాగం ఆలపిస్తున్నారు.ఇదంతా ఎందుకంటే ఎల్జీ పరిశ్రమకు అప్పన్న భూముల కేటాయింపుగాని,అనుమతులు గాని చంద్రబాబు ఇచ్చారు. అవన్నీ బయటకు రాకుండా చంద్రబాబు రోజుకొక స్టేట్ మెంట్ ఇస్తున్నారు.


కరోనాను చూసి చంద్రబాబు భయపడుతున్నాడనేది పచ్చిఅబధ్దం.చంద్రబాబు అనే వైరస్ కరోనాను కుడితే కరోనా చనిపోతుంది కాని చంద్రబాబుకు ఏమీ కాదు.ఈ విషయం ప్రజలు గుర్తించుకోవాలి.అంత విషపూరితమైనవ్యక్తి చంద్రబాబు.


గత రెండు నెలలుగా చంద్రబాబు అనధికారికంగా రాజకీయసన్యాసం చేశారు.అధికారికంగా ఈనెల 28 వతేదీన ఎన్టీఆర్ జయంతి రోజు అధికారికంగా సన్యాసం చేసి రాజకీయసన్యాసం ప్రకటిస్తే మంచిదనే భావన ప్రజలలో ఉన్నారు.


ఓడిపోయి డిప్రెషన్ లో ఉన్న తన పుత్రరత్నానికి పార్టీ అధ్యక్షబాధ్యతలు ఇచ్చి తన శేషజీవితాన్ని ఏ సింగపూర్ లోనో గడుపుకుంటే ఆయనకు మంచిదనే ఉద్దేశ్యంలో ప్రజలు ఉన్నారు.


చంద్రబాబూ....మీరు కరోనాకు టీకా వచ్చేంతవరకు ఇల్లు కదలరా...


జనాన్ని జూమ్ పెట్టి చావగొడుతున్నారు. ఇంట్లో ఉండి మీరు బతకడాన్ని ఆలోచిస్తున్నారు కాని....జనం ఎలా ఉన్నారు...వారు ఎలా బతుకుతున్నారని మీరు ఆలోచిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాను.


2019 లో మీరు, ప్రధాని మోదిగారిని తిట్టినటువంటి తిట్లు గుర్తుకుతెచ్చుకోండి.అది గుర్తుకుతెచ్చుకుంటే మీకు తప్పకుండా ఒళ్లు జలదరిస్తుంది.


ప్రధాని గురించి, ఆయన భార్య గురించి,మీ సీనియారిటీ గురించి మాట్లాడారు. సిబిఐ,ఈడి,ఐటిలు ఏపిలో అడుగుపెట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.


ఆ డైలాగ్ లు యూట్యూబ్ లో చూసుకుంటే మీ వ్యక్తిత్వం ఏంటనేది మీకే తెలుస్తుంది చంద్రబాబూ.


ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి 25 ఏళ్లు అయింది.మే 28 న ఆయనకు క్షమాపణ చెబుతారా అని ప్రశ్నిస్తున్నాను.ఎన్టీఆర్ సమాధి వద్ద పాతికేళ్లుగా ఒక్కసారంటే ఒక్కసారి మీరు కన్నీటి బొట్టు వదిలారా అని ప్రశ్నిస్తున్నాను.


ఎన్టీఆర్ బతికిఉంటే ఈరోజు మీ టిడిపిలో ఉండేవారా...లేకుంటే జగన్ గారికి మధ్దతు పలికేవారా అనేది మీరు మననం చేసుకోండి.


లాక్ డౌన్ పేరిట మీరు,మీ పుత్రరత్నం హైద్రాబాద్ లో చేస్తున్న పనేంటి.గతంలో మీరు అక్రమంగా ఆర్జించిన సొమ్ము,అక్రమాస్తులు సరిచూసుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాను.


గత ఏడాదిగా మీ ఆస్తుల విలువ పెరిగిందా...తగ్గిందా....ఆంధ్రరాష్ర్ట ప్రజలను మరచిపోయి ఇంట్లో కూర్చుని మీరు మనవడితో లేక  మీ కొడుకుతో ఆడుకుంటున్నారా.


విశాఖలో జరిగిన దుర్ఘటనకు మీరు నిజంగా బాధపడుతున్నారా అనేది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.


జగన్ గారి ముందు చంద్రబాబు నిలబడలేరని ఆదివారంనాడు  ఎల్లోపత్రిక యజమాని తేల్చేశారు.మిమ్మల్ని నమ్ముకున్నవారంతా ఇక మిమ్మల్ని నమ్ముకోవడం వేస్ట్ అని బాధపడాల్సిన పరిస్దితి ఈరోజు ఉంది.


 మీ కుమారుడు మీతో ఉంటాడా లేదా అని సందేహపడాల్సిన పరిస్దితి.


రాష్ర్టంలో మద్యం రేట్లు పెంచిన నేపధ్యంలో మీరు పెట్టిన దాదాపు 50 వేల దుకాణాలు బంద్ చేయించినందుకు బాధపడుతున్నారా అనేది ప్రశ్నించుకోండి.


 విశాఖలో జరిగిన దుర్ఘటన అందరికి మనస్తాపం కలిగే అంశం.అలాంటి దుర్ఘటన జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం అందించని రీతిలో చర్యలు తీసుకుంటూ, ప్రతి రోజు రివ్యూలు పెట్టి బాధితులను ఆదుకునే నిర్ణయాలు తీసుకుంటూ మంచి సుపరిపాలన అందించే ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన అదృష్టం.


*మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్*...


ఈ ప్రమాదం చాలా విషాదకరం.ఆరోజు నుంచి ఈరోజు వరకు మంత్రులు,జిల్లా యంత్రాగం పరిస్ధితిని సాధారణ స్దితికి తీసుకురావడానికి అంకితభావంతో పనిచేస్తున్నారు.


గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను....స్వార్ధరాజకీయనేతలు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు ఆవేశానికి లోను కావద్దు.వారి ట్రాప్ లో పడద్దు.


ముఖ్యమంత్రిగారు మీకు స్వాంతన కలిగించాలని,మానవతాదృక్పధంతో ప్రజలు ఇబ్బందులలోనుంచి బయటకు రావాలని నిర్ణయాలు తీసుకున్నారు.


పరిహారం అందించే విషయంలో చంద్రబాబులాగా వివక్షాపూరితంగా ఈ ప్రభుత్వం పనిచేయదు.ఎలాంటి వివక్షా ఉండదు.బాధితులందరికి న్యాయం జరుగుతుంది


ఆ గ్రామాలలో ఏ  సదుపాయాలు కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిధ్దంగా ఉంది.కంపెనీ లేకుండా చూడాలని ప్రజలు కోరారు.దానికి కమిటీలు వేశారు.నివేదికలు వచ్చాక నిర్ణయాలు ఉంటాయి.


ఈలోపు ప్రమాదం ఉండకూడదని స్టైరిన్ ను సౌత్ కొరియాకు పంపించారు.దీనిని బట్టి ప్రభుత్వ చిత్తశుధ్దిని అర్దం చేసుకోవచ్చు.


 విశాఖకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. స్వార్ద రాజకీయాలకోసం,రూమర్స్ సృష్టించి ఈ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయవద్దని రాజకీయపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను.ముఖ్యంగా చంద్రబాబుకు మరిమరీ విజ్ఞప్తి చేస్తున్నాను.