సబ్బులు, శానిటైజర్ల కొనుగోలుకు అంగన్‌వాడీ నిధుల వినియోగానికి వెసులుబాటు: డాక్టర్ కృతికా శుక్లా

రెండు విడతలుగా పోషకాహార పంపిణీ 
* సబ్బులు, శానిటైజర్ల కొనుగోలుకు అంగన్‌వాడీ నిధుల వినియోగానికి వెసులుబాటు
* లాక్‌డౌన్ ముగిసిన తదుపరి ప్రస్తుత కాలానికి సమాజిక తనిఖీ తప్పనిసరి 
* రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా 
విజ‌య‌వాడ‌: అంగన్ ‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార కార్యక్రమాన్ని మే నెలలో రెండు విడతలుగా అందించటం జరగుతుందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నిరంతర పొడిగింపు నేపధ్యంలో ప్రభుత్వ అదేశాల మేరకు 6 నుండి 36 నెలలు, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఆరవతేదీ లోపు ఒక విడత, మే 17,18 తేదీలలో రెండవ విడత రేషన్ పంపిణీ చేయనున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చిన్నారులు, గర్బీణీలు, బాలింతలు ఎటువంటి ఇబ్బంది పడకుండా రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యచరణతో ముందుకు సాగుతుందన్నారు. కరోనా నేపధ్యంలో అంగన్ వాడీ కార్యకర్త రేషన్ ఇచ్చే ముందు, తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసి ఉండగా, సబ్బులు, శానిటైజర్లు కొనుక్కోడానికి ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో ఉన్న నిధులను ఉపయోగించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని పంపిణీ చేయాలని ఆదేశించామని, ఎటువంటి అవకతవకలకు అస్కారం లేకుండా వలస కుటుంబాలలోని లబ్ధిదారులకు అందించిన రేషన్ వివరాలను సైతం రికార్డు చేయవలసి ఉంటుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో అందించిన సేవలపై లాక్ డౌన్ ఎత్తివేసిన తదుపరి సోషల్ అడిట్ నిర్వహిస్తామని ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని డాక్డర్ కృతికా శుక్లా హెచ్చరించారు. ఇంటివద్దనే రేషన్ తీసుకున్న లబ్ధిదారుల హాజరును సిఎఎస్ మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేసేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, సీ.డీ.పీ.ఓ. లు తగు చర్యలు తీసుకోవాలని,  టేక్ హోమ్ రేషన్ ఎన్ని రోజులకి ఇచ్చారో అన్ని రోజుల హాజరును ప్రతీ లభ్డిదారుని సిఎఎస్ లో నమోదు చేసేలా స్పష్టపరిచామన్నారు. అంగన్ వాడీల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం అంతా జిల్లా పరిపాలన అధికారి పర్యవేక్షణలో జరగవలసి ఉండగా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు వారితో సమన్వయం చేసుకొని అంగన్ వాడీ కేంద్రాలకు నిర్దేశించిన సరుకులు, గుడ్లు, పాలు తాజావి సరఫరా అయ్యేలా తగు చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. 
                                     లబ్దిదారులు పోషకాహార వినియోగంలో ఎటువంటి అంతరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల్లో అయా ప్రాంతాలను గ్రీన్/ఆరెంజ్/రెడ్ జోన్లుగా గుర్తించడం వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లా పరిపాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవలసి ఉంటుందని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. సోమవారం నుండి మే 31 వరకు 23 రోజులకు గాను రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 6-36 ,  36-72 నెలల పిల్లలు, గర్భిణీ, బాలింతలకు బియ్యం, కందిపప్పు, నూనె ఒకే సారి అందచేస్తారని, తాజా కోడిగుడ్లు, పాలు మాత్రం రెండు దఫాలుగా ఇవ్వనున్నారని వివరించారు. సాధారణ అనుబంధ పోషకాహారం కార్యక్రమం క్రింద గర్బిణీ, బాలింతలకు బియ్యం 3 కిలోలు, కందిపప్పు కిలో, నూనే అరకిలో, గుడ్లు 11, రెండు లీటర్ల పాలు మొదటి విడతగా, 12 గుడ్లు, రెండు లీటర్ల పాలు రెండో విడతగా అందచేస్తారని పేర్కొన్నారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు బియ్యం రెండు కిలోలు, కందిపప్పు అరకిలో, నూనె 250 గ్రాములు, 11 గుడ్డుల మొదటి విడతలో, 12 గుడ్లు రెండో విడతలో అందిస్తారని సంచాలకులు పేర్కొన్నారు. 6-36 నెలల పిల్లలకు మొదటి విడతలో 2.5 కిలోల బాలామృతం, ఎనిమిది గుడ్లు అందించనుండగా, మరోవైపు బాల సంజీవని కార్యక్రమం క్రింద తొలి విడతలో మూడు గుడ్లు, లీటరు పాలు, తుది విడతలో 12 గుడ్లు, లీటరు పాలు పంపిణీ చేయనున్నారు. అదే క్రమంలో బాల సంజీవని కార్యక్రమం క్రింద మూడు నుండి ఆరేళ్ల చిన్నారులకు తొలి విడతలో లీటరు, మలి విడతలో మరో లీటరు పాలు అందిస్తారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా 77 మండలాలలో ఆరు నుండి 36 నెలల పిల్లలకు తొలి విడతగా 14 గుడ్లు, 3 లీటర్ల పాలు, మలి విడతలో 14 గుడ్లు, 3.6 లీటర్ల పాలు అందించనున్నారని డాక్డర్ కృతికా శుక్లా తెలిపారు. ఇదే పధకం కింద మూడు నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు తొలి విడత రెండు, మలి విడతలో 2.6 లీటర్ల పాలు పంపిణీ చేస్తారు. వైఎస్ఆర్  సంపూర్ణ పోషణ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలకు  ఇవ్వాల్సిన అదనపు పోషకాహారం వారానికొకసారి అందించాలని ఆదేశించామని, బాల సంజీవని కార్యక్రమం క్రింద  రక్తహీనత/హై రిస్క్ గర్భిణీ, బాలింతలకు అందరికీ అందిస్తారన్నారు. కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా టేక్ హోమ్ రేషన్ పంపిణీ మహిళా సంరక్షణ కార్యదర్శి, ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్ పర్యవేక్షణలో అంగన్ వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు అందిస్తూ  కనీసం 6 అడుగుల దూరం తప్పకుండా పాటించాలని సూచించామన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image