కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చే బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చే బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని పలు దేవస్థానాలలో పనిచేస్తున్న భ్రాహ్మణులకు గురువారం నాడు కే.జి.ఆర్.వి.యస్ (కొండా.గరుడయ్య, రా.అచంద్రయ్య, వెంకటసుబ్బయ్య) చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, వంటనూనెలు పంపిణి చేశారు. స్థానిక శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. దేవస్థానాలకు సైతం లాక్ డౌన్ నిబంధనలు వర్తించడంతో ఆలయాలకు భక్తుల తాకిడి తగ్గిందన్నారు. ఈ నేపధ్యంలో అర్చకులు చాలీచాలని జీతాలతోనే కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ తరుణంలో వింజమూరు మాజీ ఉప సర్పంచ్ కొండా.వెంకటేశ్వర్లు దంపతులు బ్రాహ్మణులకు నిత్యావసరాలను ట్రస్ట్ అధ్వర్యంలో అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మండల తహసిల్ధారును ఆర్యవైశ్యులు శాలువాతో సత్కరించారు. ఇదిలా ఉండగా కొంతమంది ఆర్యవైశ్యులు బ్రాహ్మణులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షులు గణపం.బాలక్రిష్ణారెడ్డి, మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి, కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ ప్రతినిధులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటసుబ్బారావు, కొండా.సుబ్బరాయుడు, కొండా.సుమన్, ఆర్యవైశ్య సంఘం నేతలు చవల.వెంకట సత్యనారాయణ, కొండా.జయబాబు, పొన్నూరు.ప్రకాశం, సుమంగళి శారీస్ లక్ష్మీనారాయణ, కటకం.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.