ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

*ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత* వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని చాకలికొండ గ్రామానికి చెందిన చెన్నుబోయిన.మాధవ అనే వ్యక్తికి గురువారం నాడు స్థానిక యం.పి.డి.ఓ కార్యాలయంలో యం.పి.డి.ఓ యస్.కనకదుర్గా భవానీ చేతుల మీదుగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 80 వేల రూపాయలు విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వై.సి.పి మాజీ మండల కన్వీనర్ పల్లాల.కొండారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు నాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పధకమును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆయన కలలను సాకారం చేసే దిశగా నేటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు భాధిత కుటుంబాలకు ఆర్ధికంగా ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇటీవలే మండలంలో 9 మందికి 7 లక్షలా 53 వేల రూపాయలు విలువ చేసే సి.యం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో పార్టీలకు అతీతంగా అనారోగ్య భాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వింజమూరు సొసైటీ అధ్యక్షులు మద్దూరి.చిన్నిక్రిష్ణారెడ్డి, పోరెడ్డి.జగన్ రెడ్డిలు పాల్గొన్నారు.