జగన్ రెడ్డి నువ్వు మనిషివా ...రాక్షసుడివా ??
ఇది పైశాచికత్వం :ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ
కమీషన్లకు కక్కుర్తిపడి , మద్యం రేట్లు పెంచి , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు .పేదవాడి కడుపు కొట్టి , నీ జేబు నింపుకునే ప్రయత్నం ...ఆడవాళ్ళ ఉసురు పోసుకోకు !!.రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ చెయ్యటం వల్ల ...ప్రజలు భౌతిక దూరం పాటించకుండా , పోలీసులు కంట్రొల్ చెయ్యలేక కరోనా వైరస్ బారిన పడితే రాష్ట్ర ప్రభుత్వానిదే నైతిక బాధ్యత - కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ . అమరావతి రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చి , 140 రోజులు గా అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తూ , కరోనా లాక్ డౌన్ వల్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మహిళలు , దళిత రైతుల పైన కేసులు పెట్టారు ...అదే అమరావతి రాజధాని ప్రాంతంలో మద్యం షాపుల ముందు ఉదయం నుండి మస్కులు ధరించకుండా , భౌతిక దూరాన్ని పాటించకుండా బారులు తీరిన ప్రజలు !
ఇది పుర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ...
పేదవాడి ఆకలి తీర్చటానికి , అన్నం పెట్టిన ప్రతిపక్షాల పైన కేసులు పెట్టారు ...
ఇది ఎక్కడి న్యాయం ?
ముఖ్యమంత్రి గారు శవాల మీద చిల్లర ఏరుకునే ప్రయత్నాలు మాని ...లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మద్యం షాపులు తెరవ కూడదు అని డిమాండ్ !
- ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ