చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమేందుకు కూడా కొడాలి నాని పనికిరాడు బూతుల మంత్రీ ఒళ్లు దగ్గర పెట్టుకో -యరపతినేని శ్రీనివాసరావు


10.05.2020


చంద్రబాబు ఇంట్లో అంట్లు తోమేందుకు కూడా కొడాలి నాని పనికిరాడు
బూతుల మంత్రీ ఒళ్లు దగ్గర పెట్టుకో
-యరపతినేని శ్రీనివాసరావు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, పద్దతి నిన్న మంత్రి కొడాలి నాని మాట్లాడిన మాటలతో స్పష్టమైంది. బాద్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం, ఉపయోగించిన భాష అత్యంత హేయం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాద్యతాయుతంగా వ్యవహరించాలి. భాష పద్దతిగా ఉండాలి. అంతేగానీ మంత్రులుగా ఉంటూ బూతులు మాట్లాడడం సిగ్గుచేటు. మేం అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రతిపక్షం మా తప్పుల్ని ఎత్తిచూపుతూ దుర్మార్గంగా మాట్లాడారు. కానీ ఏనాడూ మేం నోరు జారలేదు, మాట తూలలేదు. కానీ వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సిగ్గేస్తోంది. తాడేపల్లి నుండి ఫోన్ వస్తే మీడియా ముందుకు రావడం కుక్కలా మొరిగి ఇంట్లోకి వెళ్లి పడుకోవడం మాత్రమే కొడాలి నానికి తెలుసు.
లారీ క్లీనర్ గా ఉన్న కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు గారి గురించి ఈ రోజు అసభ్యంగా మాట్లాడడం తగదు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని మంత్రి. నీ శాఖలో ఏం జరుగుతోందో కూడా తెలీదు. నీ శాఖకు సంబంధించి మరో మంత్రి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే నీ స్థాయేంటో గుర్తించు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కొడాలి నానికి ఉందా.? కొడాలి నానీ.. నువ్ మాట్లాడేది సరైనదేనా అని నీ మనస్సాక్సిని అడుగు. కొడాలి నాని లాంటి మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. వయసైపోయింది అంటున్న చంద్రబాబు గారు ఎలా పనిచేస్తున్నారో.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడిపారో.. యువ ముఖ్యమంత్రి అంటున్న జగన్ పనితీరు ఏంటో కొడాలి నాని బేరీజు వేసుకోవాలి. ఆయన శరీరానికి వయసైపోయిందేమో.. ఆలోచనలకు కాదని గుర్తుంచుకో. 
ఎల్.జి పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతే.. ప్రభుత్వం కుమ్మక్కవ్వడం సిగ్గుచేటు. ప్రజల తిరుగుబాటుతో మంత్రులు ఎలా తిరుగుముఖం పట్టారో చూడండి. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి.. అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రశ్నించిన ప్రజలపై కూడా తప్పుడు కేసులు పెడతారా.? గంజాయి, సారా, మట్టి, మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందని సాక్ష్యాత్తు స్పీకర్ చెప్పిన మాటలు మీకు వినిపించలేదా కొడాలి నానీ. మద్య నిషేధం పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. వాటిపై 125శాతం ధరలు పెంచి దోచుకుంటున్నారు. 
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తించిన ప్రతిసారి ఈ బూతుల మంత్రి బయటకొచ్చి ఏదేదో మాట్లాడుతాడు. అక్షరం ముక్కరాని యదవలు మా ఎమ్మెల్యేల గురించి, చంద్రబాబు గారి గురించి ఏది పడితే అది మాట్లాడితే క్షమించేది లేదు.  చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే.. కొడాలి నాని సహా వైసీపీ నేతలందరికీ చెప్పులతో కొట్టే రోజు తప్పదని గుర్తుంచుకోండి. పద్దతిగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు తిరగబడితే మీ బతుకులు ఏమవుతాయో ఆలోచించుకోండి. 
చంద్రబాబు నాయుడు గారి సలహాలను కేంద్ర ప్రభుత్వం కూడా కొనియాడింది. ఆ సలహాలు, సూచనలు నచ్చకుంటే మానుకోండి. అంతేగానీ పనికి మాలిన విమర్శలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేం బూతులు మాట్లాడలేమా.? తిట్టలేమా.? కానీ తెలుగుదేశం పార్టీకి పద్దతి, విధానం ఉంది. ఒకసారి ప్రజల్లోకి పదండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ప్రభుత్వ అసమర్ధత, చేతకాని తనం, మాఫియా, దోపిడీని ప్రజలు గమనిస్తున్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా, నియంతృత్వ పోకడలకుపోతే ప్రజలు బట్టలు ఊడదీసి కొడతారని గుర్తుంచుకోండి.