అమరావతి,మే 14 (అంతిమ తీర్పు) :
నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ సామాన్యులకు ఊరటనివ్వలేదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల్ని విశ్వసించనందువల్లే రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు.
రైతులు, వ్యవసాయదారుల గురించి పట్టించుకోలేదు.
కోట్లాదిమంది వలస కూలీలను ఆదుకునేందుకు కేవలం వెయ్యి కోట్లు ఏ మూలకు?
ఈ విధమైన నిర్ణయాలతో కరోనా సహాయక చర్యలు, కట్టడి ఎలా సాధ్యం?
ప్యాకేజీ ప్రజల్లో ఏ మాత్రం స్ఫూర్తి నింపలేకపోయింది.
ప్యాకేజీ ప్రకటన "మసిపూసి మారేడు కాయ" చందంగా ఉంది
- రామకృష్ణ.