మాధవనగర్ లో కూరగాయలు పంపిణీ చేసిన 'లెక్కల '

మాధవనగర్ లో కూరగాయలు పంపిణీ చేసిన 'లెక్కల '


వింజమూరు, మే 9 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం కాటేపల్లి పంచాయితీ పరిధిలోని మాధవ నగర్  ప్రజలకు శనివారం వింజమూరు బి.జె.పి జడ్.పి.టి.సి అభ్యర్ధి లెక్కల.రాజశేఖర్ రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలను యావత్ ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ఈ వైరస్ కట్టడికి ప్రధాని మోదీ ఆదిలోనే ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంతో ముందు చూపుతో వ్యవహరించిన ఆయన జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో ప్రజల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఆర్ధిక వ్యవస్థ మూలాలు దెబ్బతింటున్నప్పటికీ లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే మహభాగ్యమంటూ యావత్ భారతావనిని ఒక్క తాటిపై నిలిపి ప్రపంచ దేశాల దృష్టిని భారత్ వైపు మళ్ళించారని కొనియాడారు.