ప్రత్యేక రైలు లో కోవిడ్ అనుమానితులు మరియు కోవిడ్ నిర్ధారించబడిన వ్యక్తులకు సంబంధించి వేరు వేరుగా కోచ్ లను ఏర్పాటు

AP COVID 19/CONTROL
INTER STATE MOVEMENT 
****************************
*రాను రాను దేశం లో కోవిడ్ బాధితులు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తక్కువ సమయంలో తక్షణ వైద్య సేవల సౌకర్యాలు కల్పించు నిమిత్తం కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర  రైల్వే శాఖ ద్వారా ప్రత్యేక రైలు ను ఏర్పాటు చేసి దానిలోని బోగీలను  తాత్కాలిక కోవిడ్ 19 చికిత్స కేంద్రాలుగా మార్చడం.*


 కేంద్ర రైల్వే శాఖ ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న కోవిడ్ సమస్యకు తమవంతు సేవగా రైల్వే బోగీలను తాత్కాలిక  కోవిడ్19 కేర్ సెంటర్ గా మరియు   కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి బోగీలలో  అనుమానిత లేదా స్వల్ప లక్షణాలతో బాధపడే  రోగులకు అవసరమైన   అదనపు బెడ్ లు సౌకర్యం కల్పించడానికి  ముందుకు రావడం జరిగింది. 
 
ఈ కార్యక్రమం లో భాగం గా దేశవ్యాప్తంగా సుమారు 215 రైల్వే స్టేషన్లలో  ఒక ప్రత్యేక రైలు ను ఏర్పాటుచేసి అందులో గల  బోగీలను కేంద్ర ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాల ప్రకారం ఆ రైలులో గల  బోగీలను  కోవిడ్ చికిత్స అందించేందుకు అనువుగా  మార్పు చేసి క్రిమి రహితం చేసి  కోవిడ్ కేర్ మరియు కోవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చి నిర్వహిస్తారు.


దీనికి సంబంధించి కేంద్ర రైల్వే అధికారులు స్థానిక రాష్ట్ర నోడల్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపడం  ద్వారా రాష్ట్రం లో  అవసరమైన చోట ఈ ప్రత్యేక రైలు లో  కోవిడ్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ చికిత్స కేంద్రం లను ఏర్పాటు చేసి స్థానిక అధికారులకు అప్ప గించడం  జరుగుతుంది. 


దీనికి సంబంధించి కేంద్ర వైద్య  ఆరోగ్య శాఖ సూచించిన విధంగా బోగీలలో పైప్ మార్గాలతో ఆక్సిజన్, పడకలు,  దుప్పట్లు మరియు ఇతర అవసరమైన  సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. అంతే  కాకుండా ఈ ప్రత్యేక రైలు లో కోవిడ్ అనుమానితులు మరియు కోవిడ్ నిర్ధారించబడిన వ్యక్తులకు సంబంధించి వేరు వేరుగా కోచ్ లను ఏర్పాటు చేస్తారు. 


ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స రైలు నందు కోచ్ లలో క్యాబిన్ కి ఒక కోవిడ్ రోగిని అనుమతిస్తారు  మరియు .కొన్ని ప్రత్యేక సందర్భం లో క్యాబిన్ కు ఇద్దరినీ అనుమతిస్తారు. 


దేశం లో సుమారు 85 స్టేషన్లలో ఏర్పాటు చేయబడిన  కోవిడ్ చికిత్స ప్రత్యేక  రైల్వే బోగీలలో రైల్వే  శాఖ వైద్య సిబ్బంది చే సేవలు అందించబడుచున్నది. 


ఈ రైల్వే  స్టేషన్ లలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోవిడ్ రైలు స్థానిక డేడికేటెడ్ కోవిడ్ ఆసుపత్రికి అనుసంధానము ఉండేలా చూస్తారు


ఒకవేళ ఈ రైలులో చికిత్స పొందుతున్న వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక కోవిడ్ ఆరోగ్య కేంద్రానికి తరలించుటకు గాను అన్నీ వేళల అందుబాటులో ఉండే  ఆక్సిజన్ సౌకర్యం గల అంబులెన్స్ ని సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది.


ఈ ప్రత్యేక రైలు కోవిడ్ కేంద్రం లో పనిచేసే వైద్య సిబ్బంది  స్థానిక జిల్లా వైద్య అధికారి లేదా స్థానిక రాష్ట్ర  నోడల్ అధికారి  ద్వారా గుర్తించబడి స్థానిక జిల్లా  కలెక్టర్  ఆధ్వర్యం లో పని చేయటం జరుగుతుంది


సూచించిన ప్రమాణాల మేర శిక్షణ పొందిన సిబ్బందిని  మాత్రమే ఇటువంటి కేంద్రాలలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది.


 ఇక ప్రత్యేక కోవిడ్ రైలు నిర్వహణ లో రైలు ఎక్కడైతే నిలుపబడిందో అక్కడ స్థానిక రైల్వే  సిబ్బంది రైలు కు కావలసిన ఎలెక్టికల్  రిపేర్లు గాని చిన్న చిన్న మరమ్మతులు వంటి నిర్వహణ నిర్వహిస్తారు.


అవసరమైన చోట భోజన వసతి ఏర్పాట్లు కొరకు IRCTC బాధ్యత తీసుకుంటుంది. అలాగే రైల్వే రక్షక దళం బోగీలలో చికిత్స తీసుకునే  రోగులకు, చికిత్స అందించే వైద్యులకు మరియు ఇతర సహాయ  సిబ్బంది యొక్క  రక్షణ బాధ్యతలు  నిర్వహిస్తుంది. 


స్టేషన్ లో ప్రత్యేక ప్రదేశములో నిలుపబడిన కోవిడ్ రైలు చేరుటకు    సరైన సూచీలు మరియు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం ద్వారా సామాన్యులు మరియు రోగులు చేరుకొంటారు 


బోగీలలో ఉష్ణోగ్రతలు పెరగకుండా తగిన చర్యలు చేపడతారు.


కోవిడ్19 వ్యక్తుల విసర్జితాలు నిర్మూలనలో కేంద్ర పర్యావరణ మరియు అడవుల మంత్రిత్వ శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు అనుసరించబడతాయి.


మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ ప్రత్యేక కోవిడ్ చికిత్స  రైలు  విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాసా, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్, కొండాపురం(కడప), దిగువ మెట్ట స్టేషన్లలో లో ఈ ప్రత్యేక రైలు  సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది.


చికిత్సలు ముగిశాక ట్రైన్ ను తిరిగి రైల్వే శాఖ కు అందించే సమయం లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సూచించబడిన మార్గదర్శకాలు ప్రకారం ఈ ప్రత్యేక రైలు ను  క్రిమి రహితం చేసి రైల్వే శాఖకు అప్ప చెప్పడం జరుగుతుంది.
___________________________
డాక్టర్ అర్జా శ్రీకాంత్ 
స్టేట్ నోడల్ అధికారి Covid-19


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు