నాగసముద్రంలో కోడి పందేల స్థావరంపై దాడులు

నాగసముద్రంలో కోడి పందేల స్థావరంపై దాడులు


కలిగిరి, మే 12 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా కలిగిరి మండలంలోని నాగసముద్రం గ్రామ పరిసరాలలో మంగళవారం సాయంత్రం కొడిపందేల స్థావరంపై ఎస్.ఐ వీరేంద్రబాబు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 1250 రూపాయల నగదు, 5 పందెం కోళ్ళు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు నిర్వహిస్తున్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. కోడిపందేలు, పేకాట, మద్యం బెల్టుషాపులు, నిషేదిత గుట్కా ఖైనీ విక్రయాలు, అక్రమంగా మద్యాన్ని తరలించడం తదితరాలను ఎట్టి పరిస్థితులలోనూ సహించబోమన్నారు.