ప్రెస్ మీట్ -- ఉయ్యురు -- 4-5-2020
* *రెడ్ జోన్ విజయవాడ నుంచి వచ్చిగ్రీన్ జోన్ ఉయ్యురు లో తిరుగుతున్న mla సారధిని వదిలి నా మీద కేసులు పెట్టడం అన్యాయం -రాజేంద్ర ప్రసాద్ mlc*
* *లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం రెడ్ జోన్ విజయవాడ నుంచి గ్రీన్ జోన్ ఉయ్యురు వస్తున్న సారథిని 15 రోజులు క్వారంటైన్ కి పంపాలి*
నా మీద,తెలుగుదేశం నాయకులపైన నిన్న రాత్రి అక్రమ కేసులు పెట్టడం అన్యాయం. -రాజేంద్ర ప్రసాద్ mlc*
2) పోలీసుల అక్రమ కేసులకు బయపడేదిలేదు. నిరంతరం ప్రజా సేవ చేస్తూనే ఉంటాం.
3) CMRF సారథి ఇవ్వకపోతే మేం 20000 వేల రూపాయలు సహాయం చేశామని ఆ పేద కుటుంబాన్ని ఆదుకున్నామనే కేసులు కట్టారు.
4) లాక్ డౌన్ వల్ల ఆకలితో అల్లాడుతున్న పేదలకు సహాయం చెయ్యడం నేరమా ?
5) mla సారథి గారు 100 మంది ysr కార్యకర్తలతో ఉయ్యురులో రోజు తిరుగుతూ ప్రచారం చేస్తుంటే సారథి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? పైగా పోలీసులు కాపలాగా సారథి వెంట ఎందుకు తిరుగుతున్నారు?
6) 7, 11 వార్డుల్లో మొన్న సారథి పోలీసు C i, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులను 100 మంది ysr కార్యకర్తలను వేసుకొని సారథి ప్రచారం చేసారు. దానికి C.i, కమిషనర్లే సాక్షం. మరి సారథి గారి మీద కేసు పెట్టారా?
7) 4రోజుల క్రితం సారథి ఉయ్యురు సెంటర్లో అన్నదానం పేరుతో 500 మందిని పోగు చేస్తే, తొక్కిసలాట జరగలేదా? అది లాక్ డౌన్ ఉల్లంఘన క్రిందకు రాదా? సారథి మీద కేసు పెట్టారా?
8) కరోనా కేసులు తీవ్రంగా వున్న రెడ్ జోన్ ఏరియా విజయవాడ నుంచి కేసులు లేని గ్రీన్ జోన్ ఏరియా మా ఉయ్యురుకు సారథి రోజు వచ్చి 100 మందితో తిరుగుతూ కరోనా వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారు.
9) కనుక రెడ్ జోన్ విజయవాడ సిటీ నుంచి గ్రీన్ జోన్ ఉయ్యురు మున్సిపల్టి కి వచ్చి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కరోనాని వ్యాప్తి చేస్తున్న సారథి పై వెంటనే కేసులు పెట్టాలని క్వారంటైన్ చెయ్యాలని పోలీసు కమిషర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము.
10) సారథి ఉయ్యురులో తిరిగినన్ని రోజులు నేను తిరుగుతూనే వుంటాను. ఇద్దరి మీద కేసులు పెట్టండి. పోలీసులు పక్షపాతం చూపిస్తే సహించం.
11) రెడ్ జోన్ కరోనా కేసులున్న విజయవాడ నుంచి సారథి గారు రోజు ఉయ్యురు వచ్చి తిరిగితే తప్పు లేదు కానీ, నా స్వగ్రామం గ్రీన్ జోన్ అయిన ఉయ్యురులో నా ఊర్లో నేను తిరిగితే తప్పా?
12) సారథి తిరిగితే నేను తిరుగుతా. సారథి మీద కూడా కేసులు పెట్టి ఆపితే నేను ఆగుతా.కేసులకు భయపడేది లేదు. ప్రజా సేవే మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. వెనకంజ వేసేది లేదు.
13) రెడ్ జోన్, కరోనా కేసులున్న విజయవాడ సిటీ నుంచి mla సారథి కరోనా కేసులులేని ఉయ్యురు గ్రీన్ జోన్ కి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చెయ్యడం నేరం కాదా? రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి రావద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు పెట్టడం వాస్తవం కాదా?
14) సారథి ఉయ్యురు వస్తే క్వారంటైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.
15) బాధ్యత గల పౌరుడిగా చట్టాన్ని పోలీసు నిబంధనలను గౌరవిస్తాను అమలు చేస్తాను. అలాగే సారథి గారికి కూడా అదే చట్టాన్ని నిబంధనలని వర్తింప చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము -- రాజేంద్ర ప్రసాద్