తాగడానికి డబ్బు ఉన్నప్పుడు ఎందుకు దానం చేయాలి అనేది నా ఉద్దేశ్యం : భారతీయ జనతాపార్టీ మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు

భారతీయ జనతాపార్టీ మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు
*


  వచ్చే ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో పెట్టినట్లు చెరగని సిరాతో గుర్తు పెట్టాలి. వారికి ప్రభుత్వం, సామాజిక సంస్థలు, సేవా సంస్థలు ఉచిత భోజనం, రేషన్ కిట్ ఇవ్వకూడదు.  తాగడానికి డబ్బు ఉన్నప్పుడు ఎందుకు దానం చేయాలి అనేది నా ఉద్దేశ్యం భారతీయ జనతాపార్టీ మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు 
       *నేడు అన్నీ రాష్ట్రాలలో మద్యం దుకాణాలు దగ్గర జనంతో నిండిన ఈ బారులు చూస్తుంటే నాకు తెలిసి జనం ఎవ్వరూ ఈ 40 రోజుల లాక్డౌన్ కాలంలో సంపాదన లేకుండా బాధపడటం లేదు అనిపిస్తుంది.*  
      *రోజువారీ కూలీలకు, పేదవాళ్లకు పనులు లేవు తినడానికి తిండి లేదు, సంపాదన లేదు అని కొన్ని స్వచ్చంద సంస్థలు, కుల సంఘాలు, చందాలు వేసుకు మరీ గడపగడపకు తిరిగి ప్రతి ఇంటికి సరుకులు కూరగాయలు ఉచితంగా సరఫరా చేస్తే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది.*   
        *అక్కడ సంపన్నుడు ఎవరూ లేరు ఉన్నది రోజువారీ కూలీలే. ఇప్పుడు వీళ్ళను చూసి ఈ 40 రోజుల లాక్డౌన్ కాలంలో సహాయం చేసిన స్వచ్చంద సంస్థలు సిగ్గుపడాలా, సహాయం పొందిన ప్రజలు సిగ్గుపడాలో అర్ధం కావడం లేదు.* 
        *ఈ పరిస్థితి చూసాక భవిష్యత్తులో సహాయం చేయడానికి స్వచ్చంద సంస్థలు ముందుకు రాగలవా?*
        *ఏ పేదవాని పరిస్థితి చూసైనా ఆపన్న హస్తం అందించగలవా???*  
          *మిత్రులారా T.V. చూశారుగా* 
 *150 సీసాను 500 అయినా లెక్క లేకుండా గంటల సేపు నిలబడి కొంటున్నారు... ఇంకెక్కడ పేదరికం...*