బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివిధ అంశాలపై లేఖ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివిధ అంశాలపై లేఖ వ్రాసారు.


ముందుగా కన్నా లక్ష్మీనారాయణ గారు లాక్-డౌన్ నేపథ్యంలో భయంకరమైన విశాఖపట్నం గ్యాస్-లీక్ బాధితులను పరామర్శించడానికి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.


విశాఖపట్నం గ్యాస్-లీక్ ప్రమాదంలో మరణాలు మరియు వేలాది మంది బాధితుల ఆసుపత్రిపాలవడం హృదయాన్ని కలచి వేసిందని కన్నా లక్ష్మీనారాయణ . ఆవేదన వ్యక్తం చేశారు.


గ్యాస్-లీక్ బాధితులను కలుసుకొని వారి పరిస్థితి చూడటం,స్థానిక ప్రజలతో మాట్లాడటం మరియు కర్మాగారాన్ని సందర్శించిన తరువాత దుర్ఘటన సంభవించిన తీరు చూస్తే ఖచ్చితంగా ఈ దుర్ఘటన మానవ తప్పిదం వలనేనని అర్ధమవుతుందని కన్నా లక్ష్మీనారాయణ  లేఖలో వివరించారు.ఫ్యాక్టరీ బాధ్యత రహిత వైఖరి సృష్టమవుతోందని లేఖలో తెలిపారు.


ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ  సాంకేతిక నిపుణుల సహకారంతో హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని ఘటనపై న్యాయ విచారణలను నియమించాలని కోరారు.ఇలాంటి చట్టపరమైన చర్యల వలన మాత్రమే నిజాలు నిగ్గుతేలుతాయని కన్నా లక్ష్మీనారాయణ    లేఖలో పేర్కొన్నారు.


ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సహాయ చర్యలను కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు.ముఖ్యంగా బాధితులు వారి జీవితాంతం ఈ విషపూరిత స్టైరెన్ గ్యాస్ లీక్ యొక్క ప్రభావాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.బాధితులందరూ చాలా పేదవారు కావడంతో తరువాత వైద్య ఖర్చులు భరించలేరు.అందువల్ల,లీకేజీ సమయంలో ఈ వాయువును పీల్చుకోవడం వల్ల ఏదైనా అనారోగ్యనికి గురైన సందర్భంలో వారి చికిత్సకు శాశ్వత ఆరోగ్య కార్డులు జారీ చేయాలని లేఖ ద్వారా కన్నా లక్ష్మీనారాయణ  విజ్ఞప్తి చేశారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image