ప్రజల రక్షణ, ప్రభుత్వ నిబంధనలు విస్మరించే పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తాం : పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 


విశాఖపట్నం
మే 08.05.2020


ప్రజల రక్షణ, ప్రభుత్వ నిబంధనలు విస్మరించే పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తాం : పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై రాష్ర్ట పరిశ్రమలు,ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష...*


* మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు...


సంఘటన జరిగిన ప్రాంతంలో పరిస్ధితి నార్మల్ కు తేవాలని,ఇందుకు అవసరమైన మెటీరియల్ తెప్పించాలని  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశించారు.మెటీరియల్ వచ్చింది.అడిషనల్ మెటిరియల్ కూడా ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ప్రజలను రక్షించుకునే చర్యలు చేపట్టడంలో రాజీపడం. ఎంత నష్టం వచ్చినా ప్రజలకు కష్టం కలిగే ఏ పని చేయవద్దనేది ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట అని మంత్రి పేర్కొన్నారు.


స్టైరింగ్ అనేది ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలిలో సేఫ్టీ దశలోనే ఉంది.నిపుణులు చెబుతున్న ప్రకారం అది పల్మరేజ్ అయి కిందపడిపోతుంది.అది భూమిపైగాని,మనిషిపైగాని పడినా ప్రమాదం ఉండదు.


48 గంటలలో ఇవన్నీ జరుగుతాయి.ఎందుకంటే ఎయిర్ క్వాలిటి 24 గంటలక్రితం కంటే ఇప్పుడు చూస్తే మాత్రం నార్మల్ కు వచ్చేస్తుంది.


ఇండస్ర్టీస్ సేఫ్టీ ఆడిట్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటాం.గతంలో కంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో జనాభా డెన్సిటి పెరిగింది కాబట్టి మాపై మరింత బాధ్యత ఉంది.


ఎల్జీ పాలిమర్స్  గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.నిబంధనలు అతిక్రమిస్తే ఎవరినీ సహించం.


*నిన్న సౌత్ కొరియన్ అంబాసిడర్ కు చెప్పిందే మీకు చెబుతున్నాను.ఇదే ఘటన అమెరికాలోనో,యూరప్ లో జరిగి ఉంటే ఎలా స్పందించే వారో అంతే బాధ్యతగా ఇక్కడ కూడా రెస్పాన్సిబులిటి ఫీల్ అవ్వమని చెప్పాం.*


*ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎంతవారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.*


ఇక్కడ ప్రొడక్షన్ ఎవరూ స్టార్ట్ చేయలేదు.రెగ్యులర్ మెయింటెనెన్స్ కింద ఉంటుంది.వాళ్లు చేయాల్సిన ప్రొటోకాల్స్ లో ఎక్కడో లోపం వచ్చింది కాబట్టే ప్రమాదం జరిగింది.


సిస్టమ్ ఎక్కడ ఫెయిలైందో అది రీవర్క్ చేసుకుని ప్రమాదకరపరిస్ధితులు లేకుండా చర్యలు తీసుకుంటాం.అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.


 


ఎల్జి పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు, నిపుణులతోనూ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి గౌతం రెడ్డి.. విశాఖ ఘటన దురదృష్టకరం అన్నారు.కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా సీఎం వైయస్ జగన్ వ్యవహరించారు. ప్రమాదం ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి అన్నీ ఆలోచించి ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటారు.ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమని గ్రీన్‌ట్రిబ్యునల్‌ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు.
(పరిశ్రమల శాఖను అప్రమ
 నాతో సహా మంత్రులను విశాఖకు పంపించి సాధారణ పరిస్థితి వచ్చేలా చూడాలని సీఎం శ్రీ జగన్ చెప్పారు.


ఎల్జీ కంపెనీని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమని నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ ఆదేశించిందని మంత్రి తెలిపారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను స్వగ్రామాలకు అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, స్థానిక యువత, వైద్యులు వెంటనే స్పందించి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు. ప్రమాదానికి కారణమైన ట్యాంక్ పరిస్థితి, ఇతర ట్యాంక్‌ల పరిస్థితిపై రివ్యూ చేశామని మంత్రి వెల్లడించారు.


 ట్యాంక్ ఉష్ణోగ్రత 120 కన్నా తక్కువగా ఉందన్నారు. కొన్ని రసాయనాలు వినియోగించి పూర్తిగా ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నారని మంత్రి వివరించారు. ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నిపుణులను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. 48 గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్నారు. స్టైరిన్ గాల్లో తక్కువ మోతాదులో ఉందని, దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. అదేవిధంగా ఇది ఎక్కువ శాతం గాల్లో కూడా ఉండదని.. వెంటనే భూమిపై పడిపోతుందని మంత్రి చెప్పుకొచ్చారు. విశాఖ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన  86 కంపెనీలను గుర్తించామన్నారు. ఈ కంపెనీల్లో భద్రత ప్రమాణాలు పరిశీలించిన తరువాతే ఓపెనింగ్‌కు అనుమతులు ఇస్తామని మంత్రి గౌతం రెడ్డి స్పష్టం చేశారు.భవిష్యత్‌లో నివాస ప్రాంతాల దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపడతాం’ అని గౌతమ్‌ రెడ్డి అన్నారు.


----------------------------------------


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
కరోనా నియంత్రణలో విజయవాడ నగరాన్ని రాష్టానికే  ఆదర్శంగా ఉండేలా చేయాలి: సిఎస్ నీలం సాహ్ని
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image