*మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారుల విచారణ* వింజమూరు, జూలై 14 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో గతంలో జరిగిన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు సంబంధించి అధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నారు. డ్వామా కార్యాలయం నుండి మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు ముందస్తుగా 13 లక్షలా 95 వేల రూపాయల నిధులను విడుదల చేసియున్నారు. వాటిని కొంతమంది నేచురల్ లీడర్లు నిర్మాణ పనులను చేజిక్కించుకున్నారు. వారిలో కొంతమంది నాసిరకంగా మరుగుదొడ్లును నిర్మించగా మరికొంత మంది అసలు నిర్మాణాలు చేపట్టకుండానే ఆ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు, ఫిర్యాధులు అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కనకదుర్గా భవానీ ఉన్నతాధికారుల సూచనల మేరకు స్వయంగా రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో అటు బదిలీపై వెళ్ళిన అధికారులు, ఇటు నేచురల్ లీడర్లులో గుబులు మొదలైంది. అందుకు సంబంధించి పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. దుర్వినియోగం కాబడిన నిధులను యుద్ధ ప్రాతిపదికన రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే దిశగా యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న పలువురు యం.పి.డి.ఓ తీరును ప్రశంసిస్తున్నారు.