*సచివాలయాలను తనిఖీ చేసిన యం.పి.డి.ఓ* వింజమూరు, జూలై 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని పలు సచివాలయాలను శనివారం నాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకదుర్గా భవానీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఉన్న 1 వ సచివాలయంలో ప్రభుత్వ సం క్షేమ పధకాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. సచివాలయాలకు వచ్చే ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం సత్వరమే సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో వాలంటీర్లు వారి వారి ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేసే దిశగా నిత్యం వైరస్ నియంత్రణకు గానూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా యం.పి.డి.ఓ వెంట ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి శ్రీనివాసులురెడ్డి, సచివాలయ ఉద్యోగులు ఖలీల్, ప్రవీణ, సిబ్బంది ఉన్నారు.


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
21వ శతాబ్దం మనదే...మోదీ
Image
మహా నవరాత్రి ఉత్సవాల కుంకుమ పూజలు చేసి పెద్ద ఎత్తున మహా అన్నదానం................
Image
పవన్ గబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్...