*రాజగృహంపై దాడికి ప్రజా సంఘాల నిరసన* వింజమూరు, జూలై 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): డా.బి.ఆర్.అంబేద్కర్ రాజగృహం పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల ఆద్వర్యంలో వింజమూరు మండలంలోని అరుంధతివాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసీసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి .పందిటి అంబేద్కర్ మాదిగ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగపట్ల వెంగయ్య వారు మాట్లాడుతూ భారతరాజ్యంగ నిర్మాత ఇంటిపై జరిగిన దాడి అమానుషం అని అన్నారు ఈ దేశానికి దశా దిశా నిర్దేశించిన మహానాయకుడు అంబేడ్కర్ అని, ఆయన ఇంటికే రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . అలాగే డా. అంబేద్కర్ గారి వారసులందరికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే దాడి చేశారొ వారిపై రాజద్రోహం కేసు నమోదు వేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రొడ్డా పేతురు, గంగపట్ల మురళి , వర్ల తిరుమలేష్, టౌన్ అధ్యక్షుడు మల్లెల తిరుమలేష్ , గంగపట్ల అజయ్, గంగపట్ల జ్ఞాన కుమార్, శివకుమార్, జి శ్రీను, రాకేష్, పి.వెంగళరావు, పి.కొండలరావు, వెంకటకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు