విదేశీ విద్యకు ఆన్‌లైన్ వేదిక *ఎడ్వాయ్‌* విజ‌య‌వాడ‌‌: ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఐఇసి ఆబ్రాడ్ ఆరంభించిన సరికొత్త ఆన్‌లైన్ వేదిక *ఏడ్వాయ్*. విదేశాల్లో చదువులకు సంబంధించి దక్షిణాసియాలోని విద్యార్థులకు ఉచితంగా సలహా సహకారాలు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌కు ఇది ఉప‌యోగిస్తోంది. అమెరికా, బ్రిట‌న్, లండ‌న్‌, కెన‌డా, ఐర్లాండ్‌లోని ఉన్న‌త విద్యాల‌యాల స‌మాచారాన్ని ఒకే చోట అందిస్తోంది. అక్క‌డి విద్యాసంస్థ‌లు, వాటికి ఉన్న ర్యాంకింగ్‌, స్కాల‌ర్‌షిప్స్ వంటి స‌మాచారం అంతా అందులో పొందుప‌రిచారు. ఎక్క‌డిక‌క్క‌డ లింకుల‌తో సాధ్య‌మైనంత ఎక్కువ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కోర్సులు, స్కాల‌ర్‌షిప్స్‌కు సంబంధించి లోతైన స‌మాచార సేక‌ర‌ణ‌లో విద్యార్థుల‌కు రియ‌ల్ లైఫ్ అలాగే ఆర్టిఫీషియ‌ల్ అడ్వ‌యిజ‌ర్లు స‌హ‌క‌రిస్తారు. ద‌ర‌ఖాస్తు నుంచి చేర‌బోయే యూనివ‌ర్శిటీల్లో వ‌స‌తి, మెడిక‌ల్ ఇన్సూరెన్స్ వ‌ర‌కు ప్ర‌తి ద‌శ‌లో తోడ్పాడునందిస్తారు. ఆస్ట్రేలియా అదేవిధంగా యూర‌ప్‌లోని మ‌రిన్ని దేశాల స‌మాచారాన్ని కూడా అందించే ప్ర‌య‌త్నంలో ప్ర‌స్తుతం ఉంది. విదేశాల్లో చ‌దువుకోవాల‌న్న విద్యార్థుల‌కు టెక్నాల‌జీ స‌హ‌కారంతో అత్యున్న‌త సేవ‌లు అందించాల‌న్న‌ది త‌మ ఆకాంక్ష అని ఈ సంద‌ర్భంగా సంస్థ సీఈవో సాధిఖ్ భాషా వెల్ల‌డించారు. ఇత‌ర వివ‌రాల‌కు వెబ్‌సైట్ www.edvoy.com సంద‌ర్శించాల‌ని కోరారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image