*"వెంకయ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కాకాణి."* తేది:24-08-2020 *నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది.* *ఆలయ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రహ్మణ్యం ఐ.ఏ.యస్.(రిటైర్డ్) గారు, కమిటీ సభ్యులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు బహుకరించిన మీదట ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ... స్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా స్థానిక శాసనసభ్యుడు ప్రతి యేటా స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించడం ఆనవాయితీగా వస్తోందని, తనకు ఇప్పటికి ఏడుసార్లు వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కరోనా నేపథ్యంలో ఆరాధనోత్సవాలు రద్దు చేసినా, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగించి, తనకు అవకాశం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి గారికి, ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.* *కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లేందుకు వెంకయ్య స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంకయ్య స్వామి దీవెనలు ఎల్లప్పుడూ కలగజేయాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్య గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కట్టంరెడ్డి విజయ మోహన్ రెడ్డి గారు, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.*