ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర నూత‌న క‌మిటీ ఆవిర్భావం * స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ ‌క‌మిష‌న‌ర్ కృష్ణ‌బాబుతో భేటీ విజ‌య‌వాడ, ‌‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్న ప‌దోన్న‌తులు, మెర్సీ పిటీష‌న్‌, ప్ర‌భుత్వ స‌ర్వీస్ రూల్స్‌ను త్వ‌రిత‌గ‌తిన అమ‌లుప‌రచాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ క‌మిష‌న‌ర్ టి.కృష్ణ‌బాబుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపిపిటిడిఏఈఏ) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కా సాయిబాబు విజ్ఞ‌ప్తి చేశారు. ఏపిపిటిడి రాష్ట్ర నూత‌న క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఆర్టీసీ హౌస్‌లో ఆర్టీసీ ఎండీ కృ‌ష్ణ‌‌బాబును సోమ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. నూత‌న క‌మిటీ స‌భ్యుల‌ను క‌మిష‌న‌ర్ కృష్ణ‌బాబుకు పరిచయం చేయ‌డంతో పాటు సంస్థ ప‌రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను ఆయ‌న దృష్టికి తీసుకువెళ్ల‌గా ఆయ‌న సానుకూలంగా స్పందించారు. ఈ సంద‌ర్భంగా జక్కా సాయిబాబు మాట్లాడుతూ ఏపిపిటిడిఏఈఏ‌ రాష్ట్ర నూతన కమిటీలో డైరెక్టర్‌గా సీనియర్ జర్నలిస్ట్ కూర్మా ప్రసాద్‌బాబు, చైర్మన్‌గా బత్తుల వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా చంద్రగిరి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ మొహమ్మద్ రఫీ, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నాగ యాదవ్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా ఎం.కిరణ్‌కుమార్, ప్రచార కార్యదర్శిగా పి.సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా అలహరి ఏడుకొండలు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భూక్య సురేష్‌నాయక్, డిప్యూటీ చీఫ్ అడ్వైజర్లుగా కె.వి.సుబ్బారావు, చెన్నాప్రగడ ప్రసాద్, సీనియర్ జ‌ర్న‌లిస్ట్ సాగర్‌బాబు, కె.ఎస్‌.కుమార్, వినుకొండ రాజారావు, విజయవాడ రీజియన్ చైర్మన్ కొంకిమళ్ళ శంక‌ర్‌, చీఫ్ లీగల్ అడ్వైజర్‌లుగా జి.కేశవరావు, నాగిశెట్టి రవిప్రసాద్‌ ల‌తో పాటు మ‌రో 20 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా నూత‌న క‌మిటీ స‌భ్యుల‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఏ.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ పి.కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ కె.బ్రహ్మానందరెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్, చీప్ పర్సనల్ మేనేజ‌ర్‌ల‌కు పరిచయం చేశారు.