వరదలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

 


వరదల కారణంగా నష్టపోయిన వివరాలను సీఎం ముందు ఉంచిన మంత్రులు, అధికారులు 
కృష్ణా వరదల కారణంగా గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గం బాగా దెబ్బతింది: వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పామర్రు, పెనమలూరులో పంటలు దెబ్బతిన్నాయి: వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు
మరికొన్ని ప్రాంతాల్లో పంట ముంపు బారిన పడ్డాయి
విజయవాడలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి
అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలకే ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇవ్వాలని సీఎం ఆదేశం
వివిధ పథకాల కింద రైతులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకులు మినహాయించుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేయాలని ఆదేశం
ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న నష్టపరిహారాన్ని 15శాతం పెంచాలని సీఎం ఆదేశం


రైతు ప్రభుత్వమనే సంగతి మన చేతల్లో నిరంతరం కనిపించాలి
సాయిల్‌ టెస్టులు జరగాలి
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలి
వీటి నాణ్యతను గుర్తించడానికి లేబ్‌లు ఏర్పాటు చేయాలి
గ్రామ సచివాలయంలో కౌలు రైతులకు కార్డులు ఇవ్వండి,
కౌలు రైతుల చట్టంపై అవగాహన కల్పించాలి
దీనిపై వాలంటీర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి
వచ్చే 4–5 నెలల్లో అన్నీ కార్యరూపంలో ఉండాలి


పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే సలహాలు, పరిష్కారాలు ఇవ్వడానికి కాల్‌సెంటర్, ఒక యాప్‌ను సిద్ధంచేయాలని సీఎం ఆదేశాలు



సమావేశంలో మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, పేర్నినాని, మేకతోటి సుచరిత, కొడాలి నాని పాల్గొన్నారు