దేవినేని ఉమాను అడ్డుకున్న పోలీసులు.. హౌస్‌ అరెస్టు


కృష్ణా జిల్లా : తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వెళ్తుండగా పోలీసులు ఆయనను అడ్డుకుని హౌస్‌ అరెస్టు చేశారు. ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఉమాకి నోటీసులు జారీ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసేవారిని హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని, పోలీసులను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. చాలా మంది టీడీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారని మండిపడ్డారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీని తీసుకురావాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై ఆందోళనలు చేయడానికి టీడీపీ శ్రేణులు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image