ఈతకు వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత


* కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం 
విజయవాడ క్రైమ్ (కంచికచర్ల): కృష్ణా జిల్లా కంచికచర్లలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పేరకలపాడులో ఈతకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. గుజ్జర్లంక గణేష్ (8), శ్రీమంతు (5), గౌతమ్‌ (4) ముగ్గురూ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం కర్ణాటక వెళ్లగా.. చిన్నారులు నాయనమ్మ వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు.. మధ్యాహ్నం బహిర్భూమి కోసం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు అందులో మునిగి చనిపోయారు. దూరం నుంచి గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులు, పోలీసులు చెరువులో సుమారు గంటసేపు గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతిచెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నందిగామ గ్రామీణ సీఐ సతీష్, ఎస్సై శ్రీహరి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చుసిన స్థానికులు కంటతడి పెట్టారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు