తిరుపతి, ఆగష్టు 31: నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు దంపతులు శనివారం మధ్యాహ్నం 12.40 ని. లకు రేణిగుంట విమానాశ్రయం ఘనస్వాగతం లభించింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి, చంద్రగిరి శాసనసభ్యులు మరియు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బురాజన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, సెక్యూరిటీ అధికారి రాజశేఖర రెడ్డి, సిఐఎస్ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా , రేణిగుంట, ఏర్పేడు తహశీల్దార్లు విజయసింహారెడ్డి, రంగస్వామి, సెట్విన్ సిఇఓ లక్ష్మి, బిజెపి నాయకులు భానుప్రకాశ్ రెడ్డి, సైకం జయచంద్రారెడ్డి, ప్రజా ప్రతినిదులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గౌరవ భారత ఉప రాష్ట్రపతి దంపతులు 12.50 నిముషాలకు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. ఉప రాష్ట్రపతి దంపతుల వెంట కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కూడా బయలుదేరి వెళ్లారు .