తాడేపల్లి ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ సీతారాం

అంతిమతీర్పు-గుంటూరు.25.8.2019


 


*తాడేపల్లి ప్రెస్ క్లబ్ ను ప్రారముంచిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం**ఏ ఎస్ రామకృష్ణ కామెంట్స్...*


తాడేపల్లి వంటి చిన్న పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు అభినందనీయం


గుంటురులో ప్రెస్ క్లబ్ లేదు..


ఈ ప్రాంతంలో సభ్యులు సమన్వయంతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవటం మంచి పరిణామం


సమాజంలో ప్రెస్ క్లబ్ పాత్ర ఎనలేనిది


ఫోర్త్ ఎస్టేట్ గా ఎన్నో సేవలు అందిస్తుంది


ప్రింట్ మీడియా కన్నా ఎలక్ట్రానిక్ మీడియా దూసుకుపోతుంది


సోషల్ మీడియా ప్రజల్లోకి నేడు విస్తృతంగా వెళ్తుంది


బెంగళూరులో లంకేశ్ ను చంపేశారు..
21 మంది జర్నలిస్టులను చంపేశారు. 


నిజాలు సమాజనికి తెలియచేస్తున్న తరుణంలో ఈ హత్యలు బాధాకరం


రాజకీయాల్లో కూడా జర్నలిస్టులు రాణించాలి 


ప్రజలకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి


*ఎమ్మెల్సీ లక్ష్మణరావు కామెంట్స్...*


సమాజంలో మీడియా పాత్ర ఎనలేనిది


వేగంగా పెరుగుతున్న ప్రాంతం తాడేపల్లి


ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయటం అభినందనీయం


గొప్ప స్పీకర్లును ఎందరినో అందించిన ప్రజస్వామ్య దేశం మనది


తమ్మినేని సీతారాం కూడా అంతటి ఖ్యాతి గడించాలి


పత్రికల్లో న్యూస్ ఉండాలి గాని, వ్యూస్  రాయకూడదు


ఒక్కో పత్రిక ఒక్కో రాజకీయ పార్టీకి అనుకూలంగా ఏర్పాటు కావటం శోచనీయం


ఉన్నది ఉన్నట్లు రాయాలి.. నిజాయితిని ప్రతిబింబించాలి


ఎవరినైనా రాజకీయ నేతలుగా..ప్రజా సంక్షేమం కాంక్షించి విమర్శ చేస్తాం..


ప్రజాస్వామ్య హక్కు..విమర్శ చేయటం


*ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కామెంట్స్...*


వివాదాలు లేకుండా..వార్తను వార్తగా రాయగలిగే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని సూచన చేశా


నేను నా నెల జీతం రూ. లక్షా 75 వేలు  సహాయంగా అందించా


ప్రజలు సమస్యతో వస్తే వారి పక్షాన వార్తలు రాయాలి


రాజధానిలో తొలి ప్రెస్ క్లబ్ తదేపాలిలో ఏర్పాటు కావటం అభినందనీయం


పెద్దలు ఓ వైపు..నిరుపేదలు మరోవైపు  ఉన్న ఇ ప్రాంతంలో నిష్పక్షపాత పాత్ర పోషించాలి


రేపు పరీక్ష అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యేలా ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే
వారం ముందు నుంచే ప్రిపేర్ అయ్యేలా ప్రింట్ మీడియా ఉంది


విశాలాంధ్ర,,ప్రజాశక్తి పేపర్లు నేటికి రాజకీయాలతో సంబంధం లేకుండా కమ్యూనిస్టు పాత్రను సమాజానికి తెలియచేస్తూ నిజాల్ని నిర్బయంగా రాస్తున్నారు..


మిగిలిన పేపర్లును విమర్శించడం లేదు అవి కూడా నిజాల్ని నిర్బయంగా రాస్తున్నారు


కమ్యూనిస్టు పత్రికలుగా వారి సేవలు ప్రజలకు అవసరం అని చెప్తున్నా


నేనెప్పుడూ ఏ విలేకర్ని ఇబ్బంది పెట్టలేదు..వారి సంక్షేమానికి నా చేయూత అందిస్తా


నేను పొలం పని చేస్తున్నది నిజమే.. రైతన్న కష్టాన్ని నేటి తరాలకు తెలియచెపాల్సిన అవసరం ఉంది


పూట చెల్లో పనిచేస్తే దేవుడు కనబడ్డాడు.. మరి రైతులు కష్టం ఏ విధంగా ఉంటుందో


విస్తరాకు మొక్క ఎలా ఉంటుందో నేడు తెలియని దుస్థితిలో మనం ఉండటం శోచనీయం


మీడియా వారు మాత్రం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి


స్పీకర్ టీడీపీకి సమయం ఇస్తారెంటి అని భావించిన మాకు.. లోకేష్ గురుంచి నేను విమర్శ చేయగానే సభలో లేని వారి గురుంచి మాట్లాడటం సబబు కాదు అని మైక్ కట్ చేశారు..


కానీ సభాపతి ఎక్కడ నిబంధనలు తప్పకుండా ఆదర్శంగా నిలుస్తున్నారు


సమాజం ఏమి కోరుకుంటుందో అలా మీడియా మిత్రులు ఉండాలని కోరుకుంటున్నా


*తమ్మినేని సీతారాం స్పీకర్ కామెంట్స్...*


వ్యక్తిగతమైన లక్షణాలు గమనిస్తే ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిరాడంబరంగా,, అహంకారం లేకుండా సామాన్యుడిలా జీవనం సాగిస్తున్నారు.. అటువంటి శాసన సభ్యులు ఆర్కే అభినందనీయులు


ఓ వైపు బెజవాడ,, మరోవైపు గుంటూరు,,నడుమ అమరావతి అటువంటి తాడేపల్లిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు మంచి పరిణామం


*చాలా క్లిష్టమైన ఉద్యోగం జర్నలిజం*


హెచ్చరికలు,, హత్యలు,, బెదిరింపులు ఎన్ని వస్తున్న బెదరు లేకుండా ముందుకు వెళ్లే వారే జర్నలిస్టుల..


కలం ఆగదు..బయమెరుగదు..


రాజకీయ నేతలు తమ తప్పులు గురుంచి రాసినప్పుడు సెల్ఫ్ రివ్యూ చేసుకోండి..


మీడియా విస్తృతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం


విశ్వసనీయతతో వార్తలు రాయగలిగితే పత్రికపై విశ్వాసం పెరుగుతుంది


చిన్న పత్రికలు నిలదొక్కుకోలేని పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి


వాటిని కూడా నిలబడేలా మనం చేయాల్సిన అవసరం ఉంది


కృష్ణా పత్రిక నాడు ఏమిటో ఖ్యాతి గడిచింది


ప్రజలు ఈ రోజు పూర్తి అవగాహనతో ఉంటున్నారు


సోషల్ మీడియా నేడు విస్తృతంగా వార్తలు అందిస్తుంది


విమర్శ ఉన్నా కూడా దాని స్వీకరించగలగాలి


ట్విటర్,ఫేస్ బుక్,వాట్సప్ ఇలా ఎన్నో టెక్నాలజీని చేరువ చేస్తున్నాయి స్రవంతిలా ఉన్నాయి


మనిషి జీవన శైలిలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది


*మీడియా అత్యంత శక్తివంతమైన సాధనగా మారింది*


స్పీకర్ గా ఎంపిక చేసిన సమయంలో సీఎం జగన్ నాకు చెప్పలేక పోతే నేనే మీ ఆజ్ఞ శిరసా వహిస్తానని చెప్పా


శాసనసభ అద్దం లాంటి..ఇక్కడ మనం ఎలా వ్యవహరిస్తే ఆ ప్రతిబింబం బయటిబెవెళ్తుంది


మనల్ని ప్రజలు గమనిస్తుంటారు


ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి పిలిచి నా నిబద్దతను మరింతగా పెంచారు


మీకు అండగా నేను ఉంటాను.. నిబంధనలు పాటించి కఠినంగా సభను నిర్వహించండి అని మా అధినేత జగన్ చెప్పారు.


సభకు కొన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి.. అలాగే సభాపతి కి విచక్షణాధికారాలు ఉంటాయి


సభా నాయకుడు నాకు బాధ్యతలు అప్పగించారు


పూర్వం ఓటు వేసి పంపించాము అనేలా ఉండేవారు..నేడు ప్రతి ఒక్కరు గమనించాలి


పౌర వ్యవస్థ రాజకీయ నేతలను గమనిస్తున్నారు..అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి


పౌరులు వాదన చేయకపోవచ్చు సరైన సమయంలో వారు తమ తీర్పు ఇస్తారు


గత ఎన్నికల్లో అదే జరిగింది..


ఐ అండ్ పీఆర్ మినిష్టర్ గా ఉండగా బచావత్ అవార్డు తీర్పు యాజమాన్యాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందేనని స్పష్టం చేసాను


దేశంలో జరిగే అరాచకాలు ప్రపంచానికి తెలియచెప్పే పత్రికల విలేకరులు నేడు వారి బాధలు రాసుకోలేక పోతున్నారు.


ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలు మాత్రమే సక్రమంగా విలేకర్ల పట్ల సానుకూల ధోరణిలో ఉన్నాయి


మిగిలిన పత్రికలు విలేకరులను తమవారిగా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాయి


జర్నలిస్టుల మీద మీద కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంటుంది.. కత్తి మీద సాములాంటిది పాత్రికేయ వృత్తి


శక్తివంతమైన మీడియా వ్యవస్థను కాపాడుకోవాలి


పౌర వ్యవస్థకు స్పీకర్ గా నేను తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ఉంది


మీడియా నే వ్యవస్థలకు అండగా ఉండాలి


మేమున్నాం మీరు వెళ్ళండి అనే పౌర వ్యవస్థ రావాలి


తాడేపల్లి రేపటి మహానగరం కాబోతోంది


తాడేపల్లికి ఉన్న భవిష్యత్తు మరింత పెరుగుతుంది


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image