ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ మహేశ్వరి


సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్‌ న్యాయవాదిగా ఆయన పనిచేశారు. 2005లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జస్టిస్‌ విక్రంనాథ్‌ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫారసు చేయగా.. కేంద్రం ఆయన పేరును వెనక్కి తిప్పి పంపించింది. తాజాగా జస్టిస్‌ మహేశ్వరి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయనకు రాజ్యాంగపరమైన పలు కేసులు వాదించిన ఆనుభవం ఉంది.