నాసిరకం ఇళ్ళు నిర్మించారు

✍ ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ ఎద్దలరేవు సంఘం గిరిజనకాలనీలో నాసిరకంగా పక్కాఇళ్ల నిర్మాణం
✍  పూర్తి అయి సంవత్సరం కాకముందే ఉరుస్తున్న ఇల్లు.. కూలేందుకు సిద్దంగా శ్లాబ్
✍  కాంట్రాక్టర్,  హౌసింగ్ అధికార్లు కుమ్మకై నాసిరకంగా ఇల్లు నిర్మించి బిల్లులు భోంచేశారు. 
✍ ST లకు ప్రభుత్వం అదనంగా ఇచ్చిన 75వేల రూపాయలను లబ్దిదారులతో  వేలిముద్రలు వేయించుకోని డ్రాచేసి కాంట్రాక్టర్, హౌసింగ్ అధికార్లు పంచుకున్నారు
. ✍ఈ రోజు యానాదుల సంక్షేమ సంఘం బృందం  కాలనీకి వెళ్లి పరిశీలించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 ✍ దీనిపై రేపు కలెక్టర్, హౌసింగ్ అధికారులకు ఫిర్యాదు చేసి,  బాధితులకు న్యాయం చేయాలని   కోరనున్నాము.
✍ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి తలపల చంద్రమౌళి, జిల్లా మహిళా కన్వినర్ చెంబేటి సుమతి, జిల్లా ఉపాధ్యాక్షులు ఏలూరి అశోక్, ఏలూరి నారాయణ, యశోద, లక్ష్మీ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.