గుంటూరు పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలతో భేటి అయిన చంద్రబాబు
టిడిపి నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించిన చంద్రబాబు.
ఈ రోజు టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ పై తప్పుడు కేసు పెట్టారు: చంద్రబాబు
నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు
మొన్న కూన రవికుమార్ పై అక్రమ కేసులు బనాయించారు. ఆముదాల వలసలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.
పాత కేసులు తవ్వడం వైసిపి వేధింపులకు పరాకాష్ట. నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారు.
గతంతో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడిపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా..?
వందలాది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. నోరునొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నించే హక్కు కాలరాయాలని చూస్తున్నారు.
రాష్ట్రాన్ని అగ్నిగుండంలా చేయాలని చూస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు గతంలో చూడలేదు.
ఇళ్లు తగులపెడుతున్నారు, భూములు సాగు చేసుకోనివ్వడం లేదు. బోర్లు ధ్వంసం చేస్తున్నారు. చీనీ చెట్లను నరికేస్తున్నారు. ఇంత అరాచక పాలన నా జీవితంలో చూడలేదు.
వైసిపి నేతలు ఇప్పటికైనా అరాచకాలను మానుకోవాలి.
డిజిపిని టిడిపి ప్రతినిధి బృందం స్వయంగా కలిసి వినతి ఇచ్చింది
జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే అనేకమార్లు వినతులు ఇచ్చాం. అయినా గ్రామాల్లో వైసిపి అరాచకాలు తగ్గలేదు.
మొత్తం పోలీసు వ్యవస్థనే నిస్సహాయంగా మార్చారు. పోలీసులే నిస్సహాయంగా మారితే ఇక రక్షణ ఎవరు..?